ఆమె ఓ వ్యక్తిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. కానీ.. ఆ ప్రియుడు ఆమెకు వరసకు సోదరుడౌతాడు. దీంతో... ఆమె అక్క, ఇరు వైపుల కుటుంబసభ్యులు వారి ప్రేమను వ్యతిరేకించారు. ఈ కోపంతో సదరు యువతి సొంత అక్కనే గొంతు నులిమి హత్య చేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Also Read 190 ఏళ్ల నాటి అమృతాంజన్ బ్రిడ్జ్ కూల్చివేత.. లాక్‌డౌన్ వల్లే ఇది సాధ్యం...

పూర్తి వివరాల్లోకి  వెళితే...కోసవంపట్టి దేవేంద్రపురానికి చెందిన శంకరన్‌ కి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మోనిషా(18), మరో కుమార్తె ఉన్నారు. కాగా.. ఇటీవల చిన్న కుమార్తె ఓ వ్యక్తిని ప్రేమించింది. వారిద్దరూ వరసకు అన్నా చెల్లెలు కావడంతో పెళ్లికి అంగీకరించలేదు.

ఈ క్రమంలో ఈ నెల 4న ఇంట్లో ఒంటరిగా ఉన్న మోనిషా చనిపోయింది. ఎడమచేతిని కత్తితో కోసుకున్న స్థితిలో పడివుండడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతిచెందింది. దీన్ని నామక్కల్‌ పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో గొంతు నులమడంతో ఆమె చనిపోయినట్లు తెలిసింది.

దీంతో విచారించగా.. సొంత చెల్లెలే మోనిషాను హత్య చేసినట్లు తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు యువతిని, ఆమె ప్రియుడు రాహుల్ ని పోలీసులు అరెస్టు  చేశారు.