అత్తారింటికి వచ్చిన జగదీష్ అనుకోకుండా హత్యకు గురయ్యాడు. కాగా.. ఈ కేసుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిసాయి.
అక్రమ సంబంధం కోసం వెంపర్లాడి ఓ మహిళ కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. భర్తకు మందు పార్టీ ఇచ్చి మరీ.. ప్రియుడితో కలిసి పథకం ప్రకారం హత్య చేసింది. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ధర్వాడ జిల్లా హుబ్లీ తాలుకా అంచటగేరి నివాసి అక్షతకు హావేరి జిల్లా హానగల్ నివాసి జగదీష్ తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. నాలుగు నెలల క్రితం అక్షతకు ఓ మగబిడ్డ జన్మించింది. ఈ క్రమంలో భార్య, బిడ్డలను చూడటానికి జగదీష్ అత్తారింటికి వచ్చాడు.
కాగా.. అత్తారింటికి వచ్చిన జగదీష్ అనుకోకుండా హత్యకు గురయ్యాడు. కాగా.. ఈ కేసుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిసాయి. భార్యపై అనుమానంతో పోలీసులు ఆమె కాల్ డేటా పరిశీలించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అక్షతకు కాశప్ప అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్షత ప్రియుడు కాశప్ప స్వగ్రామం బాదామి తాలూకా బండకేరి. ఇతడు గత ఐదేళ్ల నుంచి కేఈబీ లైన్‌మెన్‌గా ఉంటూ అంచటగేరిలో అక్షత ఇంటి ఎదుట ఇల్లు తీసుకొని ఉండేవాడు. వీరి మధ్య గత ఐదేళ్లుగా వివాహేతర సంబంధం నెలకొంది. అంతేగాక నాలుగు నెలల క్రితం కాశప్పకు మరో యువతితో వివాహమైంది.
తమ వివాహేతర సంబంధం కొనసాగాలంటే అడ్డుగా ఉన్న భర్త జగదీష్‌ను చంపేయాలని ఇద్దరూ పథకం వేశారు. ఆ క్రమంలోనే భార్య, బిడ్డను చూసేందుకు వచ్చిన జగదీష్‌కు మంగళవారం కాశప్ప మందుపార్టీ ఇచ్చి ఊరు చివరలోని చెన్నాపుర క్రాస్ వద్ద తలపై బండరాయిని ఎత్తి వేసి హత్య చేసి పరారయ్యాడు. కొన్ని గంటల్లోనే కేసు మిస్టరీని చేధించిన పోలీసులు గురువారం నిందితులను జుడీషియల్ కస్టడీకి అప్పగించారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 27, 2020, 8:58 AM IST