Asianet News TeluguAsianet News Telugu

తాగొచ్చి వేధిస్తున్నాడని... భర్తను నరికి చంపిన భార్య...!

భర్తను నానా రకాలుగా హింసించేవాడు. చాలా కాలం పాటు ఆమె అతని వేధింపులు భరిస్తూ వచ్చింది. కానీ...ఆ వేధింపులు రోజు రోజుకీ ఎక్కువౌతూ వచ్చాయి. భర్త మారతాడులే అని ఎదురు చూసినా ఆమెకు నిరాశ ఎదురైంది. దీంతో.... ఆమె సహనం కోల్పోయింది.

woman kills her husband in UP
Author
First Published Dec 21, 2022, 10:38 AM IST

ప్రతిరోజూ మద్యం సేవించి భర్త వేధించేవాడు. చిత్ర హింసలు పెట్టేవాడు. చాలా కాలం నుంచి భర్తిస్తూ వస్తున్న ఆమె... సహనం కోల్పోయింది. భర్త వేధింపులు తట్టుకోలేకపోయింది. ఇంతకాలం పిల్లల ముఖం చూసి ఊరుకున్న ఆమె... ఇక తట్టుకోలేకపోయింది. అంతే.. భర్తను అతి దారుణంగా హత్య చేసింది.  అనంతరం భర్త శవం పక్కనే నిద్రపోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

యూపీలోని రాయ్ బరేలీలోని బచ్రావాన్ పరిధిలోని సాగో పశ్చిమ్ గ్రామానికి చెందిన అతుల్ అనే వ్యక్తి అన్నూ అనే యువతితో పెళ్లైంది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. అన్న... స్థానికంగా ఓ బ్యూటీ పార్లర్ నిర్వహించేది. కాగా... అతుల్.. ప్రతిరోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి... భర్తను నానా రకాలుగా హింసించేవాడు. చాలా కాలం పాటు ఆమె అతని వేధింపులు భరిస్తూ వచ్చింది. కానీ...ఆ వేధింపులు రోజు రోజుకీ ఎక్కువౌతూ వచ్చాయి. భర్త మారతాడులే అని ఎదురు చూసినా ఆమెకు నిరాశ ఎదురైంది. దీంతో.... ఆమె సహనం కోల్పోయింది.

ఈ క్రమంలో... డిసెంబర్ 15వ తేదీ రాత్రి సైతం... ఇదేవిధంగా మద్యం సేవించి.. వేధిస్తుండటంతో... ఆవేశంలో ఇనుపరాడ్డు తీసుకొని తలపై కొట్టి చంపేసింది. అనంతరం భర్త శవం పక్కనే రాత్రంతా నిద్రపోయింది. ఉదయాన్నే.... తన పిల్లలకు నాన్న నిద్రపోతున్నాడని.. లేపొద్దంటూ చెప్పడం గమనార్హం.  అనంతరం మరుసటి రోజు రాత్రి... భర్త మృతదేహాన్ని ఊరికి దూరంగా తీసుకువెళ్లి పడేయడం గమనార్హం.

 అతిగా మద్యం సేవించడం వల్లే తన భర్త చనిపోయాడని అందరినీ నమ్మించింది. పోలీసులు కూడా ఇలాగే కేసు నమోదు చేసుకున్నారు. అయితే దంపతుల మధ్య జరిగిన గొడవ విషయం తెలుసుకున్న పోలీసులకు అనుమానం వచ్చింది. చివరకు మృతుడి భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Follow Us:
Download App:
  • android
  • ios