క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. నేటి తరం యువత అస్సలు ఒత్తిడిని ఎదుర్కోలేకపోతోంది. ఏమాత్రం ఇబ్బంది వచ్చినా ఆత్మహత్య పరిష్కారమని భావిస్తోన్నారు. ఇలాంటి ఘటననే మహారాష్ట్రలోని థానే జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు వల్ల తీవ్ర అనార్థాలకు దారి తీస్తాయి. ఇలాంటి నిర్ణయాల వల్ల ఎన్నో కుటుంబాలు విషాదంలోని నెట్టివేయబడుతాయి. ఎన్నో మంది చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. ఇంకా ఎన్నో మంది దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. 

తాజాగా ఓ వివాహిత తీసుకున్న నిర్ణయం.. ఆ కుటుంబంలో పెను విషాదం నింపింది. 20 ఏళ్ల యువతి తన భర్తతో గొడవపడి 10 అంతస్తుల భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భర్తతో గొడవపడి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటుచేసుకుంది.


వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని థానే జిల్లా డోంబివిలి పట్టణంలో నివాసముంటున్న 20 ఏళ్ల వివాహిత తన భర్తతో గొడవపడి 10 అంతస్తుల భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుందని, కొత్తగా పెళ్లయిన దంపతులు బంధువు వద్దకు వెళ్లేందుకు వస్తున్నారని మాన్‌పాడ పోలీస్‌స్టేషన్‌ అధికారి తెలిపారు.

పూజా కరణ్ సోలంకి 10 అంతస్తుల భవనంలోని నాల్గవ అంతస్థులోని అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయిందనీ, రక్తపు మడుగులో పడి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి ప్రమాదవశాత్తూ మృతిగా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. బాధితురాలు తన స్నేహితులతో నిత్యం చాటింగ్ చేస్తోందని, దానికి ఆమె భర్త అభ్యంతరం చెప్పడంతో ఆమె తీవ్ర చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది.