ఢిల్లీలో మరోసారి మహిళ బాడీ పార్టులు ఓ బ్యాగ్‌లో కనిపించిన ఘటన కలకలం రేపింది. మహిళ తల, ఇతర బాడీపార్టులను ఓ ప్లాస్టిక్ బ్యాగులో కనిపించింది. పోలీసులు ఆ శరీర అవయవాలను ఎయిమ్స్ ట్రామాకు పంపించారు. 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కలకలం రేగింది. ఓ మహిళ తల, ఇతర బాడీపార్టులు ఓ ప్లాస్టిక్ వైట్ బ్యాగ్‌లో కనిపించాయి. ఆగ్నేయ ఢిల్లీలోని సరై కాలే ఖాన్‌లో ఓ నిర్మాణంలో ఉన్న ఓ మెట్రో సైట్ వద్ద ఈ బ్యాగ్ కనిపించింది. దీంతో స్థానికంగా కలకలం రేగింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పోలీసులకు శనివారం మధ్యాహ్నం ఈ విషయం తెలిసింది. సరై కాలే ఖాన్ ఐఎస్‌బీటీ, ర్యాపిడ్ మెట్రో కన్‌స్ట్రక్షన్ సైట్‌ను కలిపే ఫ్లై ఓవర్ వద్ద ఈ బ్యాగ్ కనిపించినట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు రాజేశ్ దేవ్ తెలిపారు.

పోలీసులు స్పాట్‌కు వెళ్లారు. ఆ బాడీ పార్టులను ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. ఆ బాడీ పార్టుల ద్వారా మృతురాలి గుర్తింపును కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: బిజీ రోడ్డుపై మహిళను కొడుతూ బలవంతంగా కారులోకి తోస్తున్న వీడియో వైరల్.. స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్

ఫోరెన్సిక్ టీమ్ కూడా స్పాట్‌కు వెళ్లి పరిశీలించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టినట్టు చెప్పారు.

గతేడాది అఫ్తాబ్ పూనావాలా తన భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను 35 ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి కొన్ని వారాలపాటు ఆమె బాడీ పార్టులను సమీపంలోని అడవిలో అర్ధరాత్రిపూట పడేసి వచ్చిన ఘటన దేశమంతటా కలకలం రేపిన సంగతి తెలిసిందే.