Asianet News TeluguAsianet News Telugu

బిజీ రోడ్డుపై మహిళను కొడుతూ బలవంతంగా కారులోకి తోస్తున్న వీడియో వైరల్.. స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్

ఢిల్లీలోని ఓ రోడ్డుపై మహిళను ఓ యువకుడు దాడి చేస్తూ కనిపించాడు. ఆమెను బలవంతంగా కారులోకి తోస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది.
 

man assaulted woman and forced into cab in a viral video, dcw responds
Author
First Published Mar 19, 2023, 1:58 PM IST

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా ఉన్న రోడ్డుపై ఓ మహిళను యువకుడు కొట్టాడు. ఆమె పై దాడి చేస్తూ బలవంతంగా ఆమెను కారులోకి తోస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. బహిరంగంగా ఆమెపై దాడి జరుగుతున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ యువతిని కారులో బలవంతంగా ఎక్కించి తీసుకెళ్లుతున్నారు. ఈ వీడియో పై ఢిల్లీ మహిళా కమిషన్ రెస్పాండ్ అయింది.

ఈ వీడియోను తమ దృష్టికి వచ్చిందని, ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపినట్టు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు వివరించారు. 

ఢిల్లీ పోలీసులు ఈ కేసు గురించి మాట్లాడుతూ, ఆ వీడియో కనిపిస్తున్న కారును తాము ట్రేస్ చేశామని వివరించారు. ఈ ఘటన శనివారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఢిల్లీ ఔటర్‌లోని మంగోల్‌పురి ఫ్లై ఓవర్ సమీపంలో చోటుచేసుకుందని తెలిపారు. ఈ కారు గురుగ్రామ్‌లోని రతన్ విహార్ ఏరియాకు చెందినదని వివరించారు. ఈ ఘటన కోసం ప్రత్యేకంగా ఓ పోలీసు బృందాన్ని అక్కడికి పంపినట్టు చెప్పారు. కారును, దాని డ్రైవర్‌ను తాము ట్రేస్ చేసినట్టు తెలిపారు. 

Also Read: భారత్ లో పెరుగుతున్న కోవిడ్.. ఒకే రోజులో 1,071 కొత్త కేసులు నమోదు.. 129 రోజుల తరువాత అత్యధికం

ఆ కారును ఉబర్‌లో బుక్ చేశారని, ఇద్దరు యువకులు, ఒక యువతి ఈ కారులో రోహిణి నుంచి వికాస్‌పురికి బయల్దేరారని తెలిపారు. దారి మధ్యలోనే వారికి గొడవ జరిగిందని వివరించారు. ఆ గొడవ తర్వాత యువతి కారు నుంచి బయటకు వచ్చిందని, దీంతో ఒకరు కారులో నుంచి బయటకు తీసి ఆమెను బలవంతంగా కారులోకి తోశారని పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios