ఇంటికి వెడదామని బైక్ బుక్ చేసుకుంటే.. ఆ మహిళకు షాకింగ్ అనుభవం.. బీకేర్ ఫుల్ అంటూ ట్వీట్....
ఇంటికి వెడదామని బైక్ బుక్ చేసుకున్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడో బైకర్. రైడ్ పూర్తయిన తరువాత ఆమె నెం.కు మెసేజ్ లు పెడుతూ, వేధించాడు.

బెంగళూరు : కర్ణాటకలోని బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బైక్ బుకింగ్ యాప్ లో బైక్ బుక్ చేసుకున్న ఓ ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురయింది. ఇటీవలి కాలంలో ప్రయాణాన్ని సులభతరం చేయడం కోసం రకరకాల వాహన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. సమయాన్నిబట్టి వినియోగించుకుంటూ.. రకరకాల పనులు పూర్తి చేసుకుంటుంటాం.
అవసరాన్ని బట్టి టూవీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ బుక్ చేసుకునే ఆప్షన్లు ఉండడంతో..వాహనాల బుకింగ్ యాప్స్ కి డిమాండ్ బాగానే పెరిగింది. అయితే, ఇది ఒక్కొక్కసారి మిస్ ఫైర్ అవుతున్న ఘటనలు కూడా అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి. అలాంటి అనుభవమే ఓ మహిళకు ఎదురయ్యింది.
ఓ కంపెనీకి చెందిన బైక్ ని బుక్ చేసుకున్న మహిళతో రైడింగ్ సమయంలో బైకర్ ఆమెతో మిస్ బిహేవ్ చేశాడు. ఆ తర్వాత వాట్సప్ లో అసభ్యకరమైన మెసేజ్లు పంపించాడు. దీంతో ఆమె షాక్ అయింది. అతడిని బ్లాక్ చేసినా నెంబర్లు మారుస్తూ కాల్స్ చేస్తున్నాడు.
బాధితురాలు తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. బాధితురాలు దానికి సంబంధించిన వివరాలను ఇలా తెలిపింది.. బెంగళూరుకు చెందిన తాను ఓ మీటింగ్కు వెళ్ళింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లడం కోసం ఓ యాప్ లో బైక్ బుక్ చేసుకుంది.
అయితే తనను పిక్ చేసుకోవడానికి వచ్చిన రైడర్ యాప్ లో ఉన్న బైక్ నెంబర్ తో కాకుండా మరో నెంబర్ తో వచ్చాడు. అది ప్రశ్నించగా.. తానేనని అప్పటికేదో సర్ది చెప్పాడు. ఆ తర్వాత రైడ్ స్టార్ట్ అయ్యాక.. ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక నిర్మానుష్య ప్రాంతంలో బైకును కాస్త స్లోగా నడుపుతూ.. ఒక చేత్తో బైకు నడుపుతూ మరో చేత్తో తనమీద అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది.
దీంతో తాను తీవ్ర భయాందోళనకు గురయ్యానని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇంటి లోకేషన్ వరకు బైక్ బుక్ చేసుకున్నప్పటికీ… 200 మీటర్ల దూరంలోనే తనను వదిలేశాడని పేర్కొంది. ఇంతటితో ఈ సమస్య పూర్తిగా కాలేదు. ఆమె పేమెంట్ చేసిన నెంబర్ను నోట్ చేసుకున్న ఆ బైకర్.. వాట్సాప్ లో అసభ్యకర మెసేజ్లు పంపించడం మొదలుపెట్టాడు. దీంతో అతడి నెంబర్ ని బ్లాక్ చేసింది.
వాట్సప్ చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ.. ఆ వాహనాల బుకింగ్ సంస్థ మీద మహిళ మండిపడింది. ఇలాంటి బైకర్ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించింది. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యత లేదా అని ప్రశ్నించింది. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణానుభవం ఇచ్చేలా చర్యలు తీసుకోమని కోరింది. అయితే, ఆ వ్యక్తి ఇప్పటికీ తనకు వేరే వేరే నెంబర్ ల నుంచి కాల్ చేస్తూనే ఉన్నాడని చెప్పుకొచ్చింది.