సారాంశం

మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు దాడిచేసి..బట్టలు విప్పించి, కొట్టారు. ఆ సమయంలో ఆ బాలిక ఓ మ్యూజిక్ టీచర్ తో సన్నిహితంగా ఉంది.  
 

పాట్నా: బీహార్‌లో ఓ బాలికతో ఓ వ్యక్తి సన్నిహితంగా ఉండడం చూసిన ముగ్గురు వ్యక్తులు వారిని పట్టుకున్నారు. ఆ తరువాత అమ్మాయి, ఆ వ్యక్తిని బట్టలు విప్పించి, దాడిచేసి కొట్టారు. ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ముగ్గురు వ్యక్తులు మైనర్ బాలికను, ఓ వ్యక్తిని బట్టలు విప్పించి.. దాడి చేసినట్టుగా ఇందులో కనిపిస్తుందని ఒక అధికారి తెలిపారు. బాధితుడైన ఆ వ్యక్తిని సంగీత ఉపాధ్యాయుడిగా గుర్తించారు. అతని వయస్సు 40 ఏళ్లలోపు ఉంటుందని పోలీసులు తెలిపారు. 

దొంగతనం అనుమానంతో ఇద్దరు మహిళలపై దాడి, అర్ధనగ్నంగా..! బెంగాల్‌లో దుర్ఘటన

"బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, సంగీత ఉపాధ్యాయుడిని అరెస్టు చేశాం. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, షెడ్యూల్డ్ కులాలు,  షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, సమాచార సాంకేతిక (ఐటి) సెక్షన్ 67 బి సెక్షన్ 67 బి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని (ఐటి) సెక్షన్ 37 పోలీసు యోగేంద్ర కుమార్ తెలిపారు.

మైనర్ బాలికపై దాడి చేసిన ముగ్గురిని, నిందితులను అరెస్టు చేయడానికి అన్వేషణ కొనసాగుతోందని, ఈ సంఘటన గురువారం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

"పోలీసులు వీడియోను పరిశీలిస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల బట్టలు, సంఘటన స్థలం నుండి స్వాధీనం చేసుకున్న ఇతర సాక్ష్యాలను కూడా ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపించాం" అని తెలిపారు. కేసు దర్యాప్తు కోసం సీనియర్ మహిళా పోలీసు అధికారి ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

బాధితురాలికి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని, మేజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేస్తామని ఆయన తెలిపారు.