ఉద్యోగాలు చేసే మహిళలకు సదరు కంపెనీలు మెటర్నిటీ బెనిఫిట్స్ కల్పిస్తుంటాయి. ఆరు నెలలపాటు జీతం ఇస్తూనే సెలవలు ఇవ్వాలంటూ మన దేశంలో రూల్ ఉంది. అయితే... ఈ రూల్ విషయంలో తాజాగా మద్రాస్ హైకోర్టు సంచలన కామెంట్స్ చేసింది.

ఎవరైనా మహిళకు తొలి కాన్పులో కవలలు పుడితే.. మరోసారి కాన్పులో బిడ్డను కంటే.. సదరు మహిళకు మెటర్నరీ బెనిఫిట్స్ ఇవ్వడానికి వీలు లేదంటూ మద్రాస్ హైకోర్టు పేర్కొంది. అది  సదరు మహిళకు రెండో కాన్పు అయినప్పటికీ.. మూడో బిడ్డగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు.

Also Read బంధువుల వేధింపులు... వాట్సాప్ లో సూసైడ్ నోట్ పంపి...

మొదటి కాన్పులో కవలలు పుట్టినప్పటికీ.. ఒకరి తర్వాతే మరొకరు పుడతారు కాబట్టి.. అప్పటికే రెండు డెలివరీలు అయినట్లుగా పరిగణించాలని పేర్కొనడం గమనార్హం. కవలలు అయినప్పటికీ.. వారిని తల్లి గర్భం లో నుంచి ఒకేసారి బయటకు తీయలేరని.. ఒకరి తర్వాతే మరొకరిని తీస్తారని పేర్కొన్నారు. దీనిని బట్టి అప్పటికే రెండు డెలివరీలు పూర్తయ్యాయి కాబట్టి.. తర్వాత మరోసారి గర్భం దాల్చితే.. మెటర్నిటీ బెనిఫిట్స్ అందజేయలేరని కోర్టు పేర్కొంది. 

ఓ మహిళ మెటర్నటీ విషయంలో కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం పైవిధంగా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన అప్పీల్ విచారణకు వచ్చినప్పుడు ధర్మాసనం పరిశీలించింది. రెండవ డెలివరీ అయినప్పటికీ మూడో బిడ్డ అవుతుందని వారు పేర్కొన్నారు. హక్కుదారుకు ఇద్దరు పిల్లలు లేకుంటే ప్రయోజనాల ప్రవేశం పరిమితం అవుతుందని వారు పేర్కొన్నారు.