నాగపూర్: ఓ వ్యక్తి ఓ మహిళ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తన ప్రియుడిని చంపితే ఓ రాత్రి నీతో గడుపుతానంటూ ఓ వ్యక్తికి ఆఫర్ ఇచ్చింది.  అప్పటికే పెళ్లయిన ఓ వ్యక్తితో 20 ఏళ్ల వయస్సు గల యువతి అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే, ఇటీవల ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. 

అతను అందుకు అంగీకరించలేదు. ఆమెపై పెళ్లి చేసుకోవద్దంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. దాంతో ఆమెకు అతనిపై ఎక్కడలేని కోపం వచ్చింది. దాంతో అతన్ని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అందుకు హంతకుడికి లక్షన్నర రూపాయలు ఇచ్చింది. అంతేకాకుండా ఓ రాత్రి నీతో గడుపుతానంటూ అతనికి ఆపర్ ఇచ్చింది. 

ఆమె ఆఫర్ నచ్చడంతో ఆ వ్యక్తి ఆమె ప్రియుడిని చంపేశాడు. మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.  యువతి ప్రియుడు ఫిబ్రవరి 25వ తేదీన మరణించాడు. తన ప్రియుడు చందూకు దూరపు చుట్టం భరత్ గుర్జార్ కు ఆమె సుపారీ ఇచ్చింది. చందూకు, గుర్జార్ కు మధ్య ఆర్థిక తగాదాలు కూడా ఉన్నాయి.

యువతి ఆఫర్ తో తన పని పూర్తి చేయడానికి భరత్ గుర్జార్ పక్కా ప్లాన్ వేశాడు. మద్యం సేవిద్దామని గుర్జార్ చందూను ఓ నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. అక్కడ అతని తల పగులగొట్టి, గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని క్రషర్ మైన్ వద్ద పారేశాడు. 

సంఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. గుర్జార్ ను శుక్రవారంనాడు అరెస్టు చేశారు అయితే, గుర్జార్ కు యువతి ఇచ్చిన ఆఫర్ అందక ముందే అనతు కటకటాల పాలయ్యాడు. యువతిపైనా, ఆమె తల్లిదండ్రులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.