చివరకు ఆమెకు నాలుగేళ్ల తర్వాత గర్భం దాల్చింది. చివరకు ఆమెకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా నలుగురు సంతానం కలగడం విశేషం.
ఓ మహిళకు ఒకే కాన్పులో నలుగురు సంతానం కలిగారు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. పెళ్లైన నాలుగేళ్లకు ఆమె గర్భం దాల్చగా, ఒకేసారి నలుగురు జన్మించడం విశేషం. ఒకేసారి నలుగురు జన్మించడంతో ఆ దంపతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ అరుదైన ఘటననకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...
రాజస్థాన్ రాష్ట్రం వజీర్ పురా గ్రామానికి చెందిన ఓ మహిళకు పెళ్లై దాదాపు నాలుగేళ్లు అవుతోంది. అయితే, వెంటనే గర్భం దాల్చలేదట.దీంతో, వారు చాలా ఎదురు చూశారు. చివరకు ఆమెకు నాలుగేళ్ల తర్వాత గర్భం దాల్చింది. చివరకు ఆమెకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా నలుగురు సంతానం కలగడం విశేషం.
ఆమె గర్భం దాల్చిడంపై ఆమెకు చికిత్స అందించిన వైద్యురాలు మాట్లాడారు. ఆదివారం మహిళను ఆస్పత్రికి తీసుకువచ్చారని, అర్థరాత్రి దాటిన తర్వాత ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయన్నారు. దీంతో, ఆమెకు వెంటనే డెలివరీ చేశామని ఆమె వైద్యులు చెప్పారు. సోమవారం ఉదయంగ5గంటల 51 నిమిషాలకు తొలి శిశువు జన్మించిందని, తర్వాత నాలుగు నిమిషాల గ్యాప్ లో మరో ముగ్గురు జన్మించారని చెప్పారు. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు జన్మించారు.
మహిళ గర్భందాల్చిన రెండో నెలలోనే ఆమె కడుపులో నలుగురు ఉన్నారని గుర్తించామని చెప్పారు. అయితే, నాలుగో నెలలో కొంచెం ఇబ్బంది ఏర్పడిందని, వెంటనే చికిత్స అందించడంతో, ఆమె గర్భం నిలపడిందని చెప్పారు.
