ఒక కాన్పులో మహిళ ఇద్దరికి జన్మనివ్వడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఎక్కడైనా ఒకరిద్దరూ ముగ్గురికి లేదంటే నలుగురికి జన్మనిస్తుంటారు. అయితే... ఓ మహిళ మాత్రం ఏకంగా ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Also Read రూ.30కే అన్‌లిమిటెడ్ చికెన్... 1000 కిలోల ‘‘ముక్క’’ని ఊదేశారు...

పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని షివోపూర్ జిల్లాకు చెందిన మూర్తి మాలే (22) జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ప్రసవించారు. ఆమెకు మొత్తం ఆరుగురు శిశువులు కాగా.. వారిలో నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. 

అయితే. శిశువులు చాలా తక్కువ బరువుతో జన్మించారు.  ఈక్రమంలో.. ఇద్దరు అమ్మాయిలు పుట్టిన కాసేపటికే మరణించారు. మిగతా వారికి ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  ఆరుగురు శిశువుల మొత్తం బరువు కేవలం 3.65 కేజీలు కావడం గమనార్హం. ఆ నలుగురు చిన్నారులను కూడా అతి జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుందని చెప్పారు.