Asianet News TeluguAsianet News Telugu

మతం మారుస్తూ మూడు పెళ్లిళ్లు చేసుకున్న మహిళ.. రెండో భర్తతో మాట్లాడిందని.. హత్య చేసిన మూడో భర్త..!

మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ మహిళ మూడో భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యింది. రెండో భర్తతో తిరిగి సంబంధాలు పెట్టుకోవడమే ఈ హత్యకు కారణం అని తెలుస్తోంది. 

woman gets killed by her third husband in delhi
Author
First Published Dec 30, 2022, 9:10 AM IST

ఢిల్లీ : ఢిల్లీలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె మూడో భర్త ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. తనను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా రెండో భర్తతో వీడియో కాల్ లో మాట్లాడడమే దీనికి కారణం.  ఢిల్లీలోని ఘజియాబాద్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను చంపిన ఆమె మూడో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మృతురాలు భవ్య శర్మ. ఆమెకు అంత క్రితమే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. 5 నెలల క్రితం వినోద్ శర్మను మూడో పెళ్లి చేసుకుంది.

డిసెంబర్ 26, 2022 న, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక మహిళ మృతదేహం కనుగొనబడింది. ఆమెను భవ్య శర్మ, వయసు 35గా పోలీసులు గుర్తించారు. ఆమెను ప్రస్తుత భర్త వినోద్ శర్మ హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. మృతురాలికి వినోద్ మూడో భర్త. భవ్యను తన రెండో భర్త అనీస్‌తో చూసిన వినోద్ శర్మ కత్తితో పొడిచాడు. భవ్య హత్య కేసులో పోలీసులు వినోద్‌ను అరెస్ట్ చేశారు. భవ్య గతంలో మతం మారి మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

రూర్కీ వద్ద రోడ్డు ప్రమాదం:ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ కు గాయాలు

మీడియా కథనాల ప్రకారం, భవ్య శర్మ చేసుకున్న మూడు వివాహాలలో ఇద్దరు హిందువులు, ఒకరు ముస్లిం. ఈ మూడు పెళ్లిళ్లూ ప్రేమ వివాహాలే అని సమాచారం. ఈ వివాహాల కోసం, ఆమె ప్రతిసారీ తన మతాన్ని మార్చుకుంది. భవ్య బీహార్‌లోని సీతామర్హికి లో ఉండేది. తరువాత ఆమె కుటుంబం ఘజియాబాద్‌లోని సిద్ధార్థ్ విహార్‌కు మారింది.

మొదటి పెళ్లి కోసం ఆమె అంజలిగా మారింది. ఢిల్లీకి చెందిన యోగేంద్ర కుమార్‌తో 2004లో మొదటి వివాహం జరిగింది. వారిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ తర్వాత 2017లో అనీస్‌ను పెళ్లి చేసుకుని అఫ్సానాగా మారింది. ఆమెకు అనీస్‌తో ఆదిల్ అనే కుమారుడు ఉన్నాడు. దీని తరువాత, 2019లో, ఆమె గురుగ్రామ్‌కు చెందిన వినోద్ శర్మను మూడవసారి వివాహం చేసుకుంది. దీనికోసం ఆమె భవ్యగా మారింది. భవ్య శర్మ, వినోద్ శర్మలతో పాటు రెండో భర్తతో పుట్టిన కొడుకు ఆదిల్ కూడా కలిసి జీవించారు.

డిసెంబర్ 26న ఘజియాబాద్‌లోని సిద్ధార్థ్ విహార్‌లోని బృందావన్ ఎన్‌క్లేవ్‌లో మృతదేహం లభించిన తర్వాత వినోద్ మొదట పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. డిసెంబర్ 25న భవ్య శర్మ ఇండోర్ నుంచి తిరిగి రాగా, రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. డిసెంబరు 26వ తేదీ ఉదయం ఆమె మంచంపై శవమై కనిపించింది. పోస్టుమార్టం నివేదికలో భవ్య పొత్తికడుపులో కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వినోద్‌ను మరోసారి పిలిపించి విచారించగా తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు.

భవ్య డబ్బుతోనే ఇంటి ఖర్చులు చూసుకున్నట్లు వినోద్ పోలీసులకు తెలిపాడు. ఆదిల్‌ని స్కూల్‌కి దింపడం దగ్గర్నుంచి భవ్య తరచూ పని నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో వినోద్ ఇంటి పనులన్నీ చేసేవాడు. ఈ క్రమంలో డిసెంబర్ 24 రాత్రి వినోద్ భవ్య శర్మతో వీడియో కాల్ లోమాట్లాడాడు. ఆ సమయంలో అతనికి ఆమె రెండవ భర్త అనీస్‌ కనిపించాడు. అంతేకాదు వినోద్‌ను ఘజియాబాద్‌ వదిలి వెళ్లాలని, లేకుంటే ప్రాణాలు తీస్తానని అనీస్‌ బెదిరించాడు. అది విన్న వినోద్ కి కోపం వచ్చింది. 

దీని తరువాత, భవ్య శర్మ డిసెంబర్ 25, 2022 న ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, అతను తన పథకం ప్రకారం ఆమెను హత్య చేశాడు. హత్య జరిగిన సమయంలో వినోద్‌ మార్కెట్‌ నుంచి కొన్ని సరుకులు తీసుకురమ్మని ఆదిల్‌ను పంపించాడు. ఆదిల్ ఇంటికి వచ్చేసరికి హత్య చేసి, ఆధారాలన్నీ చెరిపేశాడు.

ఆదిల్ ఇంటికి తిరిగి రాగానే వినోద్ అతనితో “మీ అమ్మ నిద్రపోతోంది. ఆమెను డిస్టర్బ్ చేయకు" అని చెప్పాడు.. ఆ తరువాత  వినోద్‌ విజయనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి భవ్య మృతిపై సమాచారం అందించాడు. సాక్ష్యాధారాలన్నీ ధ్వంసం చేసినందున పోలీసులు తనను పట్టుకోలేరని భావించాడు. అయితే పోలీసుల విచారణలో అతడు నేరం అంగీకరించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios