Asianet News TeluguAsianet News Telugu

కేరళలో అమానుషం.. ఇంట్లో ప్రసవించి, పసికందుకు బట్టలో చుట్టి బకెట్ లో వదిలేసిన మహిళ...

ఓ మహిళ ఇంట్లోనే ప్రసవించింది. ఆ తరువాత నవజాత శిశువును ఓ గుడ్డలో చుట్టి బాత్రూంలోని బకెట్లో పెట్టింది. రక్తంతో తడిసిన బట్టలతోనే ఆస్పత్రికి చేరుకుంది. 

Woman gave birth to infant in home, left in toilet bucket, kerala - bsb
Author
First Published Apr 5, 2023, 7:18 AM IST

కేరళ : ఇటీవలి కాలంలో అమానుష ఘటనలు ఎక్కువవుతున్నాయి.  నవమాసాలు మోసి, జన్మనిచ్చిన.. పిల్లల మీద తల్లులు పుట్టగానే కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎలాంటి అనుబంధం లేకుండా వారిని చెత్తకుండీల్లోనో, బాత్రూం ఫ్లెష్షుల్లోనో, బహిరంగ ప్రదేశాల్లోనూ వదిలేసి వారి ప్రాణాలను తీస్తున్నారు. తల్లులు ఇంత కర్కశంగా మారడానికి ఏం కారణం అవుతుందో తెలియదు. కానీ, అలాంటి మరో ఘటన కేరళలోని తిరువనంతపురంలో వెలుగులోకి వచ్చి షాక్ కు గురి చేసింది. ఓ తల్లి  ఇంట్లోనే ప్రసవించింది. అనుకోకుండా నొప్పులు వచ్చి ఒక్కోసారి ఇలా బాత్ రూమ్ కి వెళ్ళినప్పుడు డెలివరీ అయిపోవడం మామూలు విషయమే. 

కానీ, ఓ మహిళ ఇంట్లోనే  డెలివరీ అయ్యి, అప్పుడే పుట్టిన పసికందును ఓ గుడ్డలో చుట్టింది. ఆ బిడ్డని బాత్రూం లోని బకెట్ లో పెట్టేసింది. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో తడిచిన బట్టలతోనే ఆసుపత్రికి వెళ్ళింది. తనకు వైద్యం చేయాలని డాక్టర్లను కోరింది. ఆమె పరిస్థితి చూసి ఆశ్చర్యపోయిన వారు ఏమైందని ప్రశ్నించారు. దీంతో ఆమె అసలు విషయం చెప్పింది. ఆమె చెప్పిన విషయం విని షాక్ అయిన డాక్టర్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వైద్యుల అందించిన సమాచారం మేరకు ఆ మహిళ ఇంటికి వెళ్లిన పోలీసులు బాత్రూంలోని బకెట్లో ఉన్న పసికందును కాపాడారు. ఈ ఘటన కేరళలోని అళప్పుళలో కలకలం రేపింది. 

కన్నతండ్రే కాల యముడయ్యాడు.. ఇద్దరు కుమార్తెలను గొడ్డలితో నరికి హత్య.. అడ్డొచ్చిన భార్య,మనవడిపై..

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..  మంగళవారం కేరళలోని అళప్పుళలో ఓ మహిళ తన ఇంటి దగ్గరే ప్రసవించింది. ఏమైందో తెలియదు కానీ ప్రసవించిన వెంటనే శిశువును గుడ్డులో చుట్టి బాత్రూంలోని బకెట్ లో పెట్టింది. ఆ తర్వాత రక్తంతో తడిసిన ఆ బట్టలతోనే చెంగనూరు ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడి వైద్యులతో తనకు వైద్యం చేయాలని  కోరింది. దీంతో వైద్యులు ఏమైందని ప్రశ్నించగా..  తాను డెలివరీ అయ్యానని.. ఇంట్లోనే బిడ్డను వదిలేసి వచ్చానని చెప్పింది. వెంటనే వైద్యులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. 

అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ఆ మహిళ ఇంటికి చేరుకుని బకెట్లో ఉన్న శిశువును గుర్తించారు. చికిత్స నిమిత్తం దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఆ శిశువును పరిశీలించిన వైద్యులు మగ శిశువుగా గుర్తించారు.  బరువు 1.3కేజీలు ఉన్నట్లు తెలిపారు. ఆరోగ్యం బాగానే ఉందని ధ్రువీకరించారు. తల్లి ఈ ప్రవర్తనతో అనుమానించిన పోలీసులు పథనంథిట్ట శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించి.. శిశువును వారికి అప్పజెప్పారు.

శిశు సంక్షేమ శాఖ అధికారులు..  శిశువుకు మెరుగైన వైద్యం కోసం కొట్టాయం వైద్య కళాశాల ఆసుపత్రికి తమ వాలంటీర్ల సహాయంతో తరలించారు. కాగా, రక్తమొడుతూ ఆసుపత్రికి చేరిన తల్లి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె చికిత్స అనంతరం పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేశారు. ఇంత జరిగినా ఆమె  నవజాత శిశువును అలా బకెట్లో ఎందుకు వదిలేసి వచ్చిందో అనే అంశం వెలుగులోకి రాలేదు. మృత శిశువు అయి ఉంటుందన్న కారణంతోనే బకెట్లో వదిలేసి ఉంటుందని పోలీసులు అనుకుంటున్నారు.  ముఖ్యంగా ఈ విషయం మీదే విచారణ జరపనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios