Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరప్రదేశ్ లో షాకింగ్.. క్యాబ్ లో మహిళపై సామూహిక అత్యాచారం...

ఉత్తరప్రదేశ్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. క్యాబ్ లో ఎక్కిన ఓ మహిళను డ్రైవర్, అతని స్నేహితులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

woman gang raped in cab near Yamuna Expressway In Uttar Pradesh
Author
First Published Dec 29, 2022, 8:51 AM IST

ఆగ్రా : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో బుధవారం తెల్లవారుజామున 23 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆగ్రా పోలీస్ కమిషనర్ ప్రీతీందర్ సింగ్ మాట్లాడుతూ నోయిడా నుండి ఔరయ్యాకు షేర్డ్ ప్రైవేట్ టాక్సీలో ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగిందని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

“ఆ మహిళ బుధవారం ఉదయం ఎత్మాద్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో తనపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. మంగళవారం రాత్రి 8.30 గంటలకు నోయిడా సెక్టార్ 37లో ట్యాక్సీ ఎక్కినట్లు ఆమె తెలిపారు. ఆ సమయంలో "క్యాబ్‌లో ఇతర ప్రయాణికులు కూడా ఉన్నారు" అని ఆమె పేర్కొంది. 

ఎక్స్‌ప్రెస్‌వే ముగుస్తున్న కుబేర్‌పూర్ ఎక్స్‌ఛేంజ్‌లో ఇతర ప్రయాణికులు దిగారని, కాన్పూర్ సమీపంలోని ఔరయ్యకు వెళ్లాల్సి ఉన్నందున, డ్రైవర్ తనను ఫిరోజాబాద్‌లో డ్రాప్ చేస్తానని చెప్పాడని ఆ మహిళ తెలిపింది. ఆ తరువాత డ్రైవర్ తన ఇద్దరు స్నేహితులక పోన్ చేసి.. పిలిచాడు. తరువాత వారిద్దరూ ఎత్మద్ పుర్ సమీపంలో కారు ఎక్కారు. ఆ తరువాత ముగ్గురూ కలిసి కారు యమునా ఎక్స్ ప్రెస్ వే దగ్గరికి రాగానే ఆపేసి.. ఆమెను రోడ్డు పక్కనున్న పొదల్లోకి లాక్కెళ్లారు. 

వార్నీ.. ప్రేయసితో పారిపోయేందుకు ఓ వ్యక్తిని చంపి.. తానేనని నమ్మించాలని.. ఓ వృద్ధుడి మాస్టర్ ప్లాన్..

ఆమె మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత ఆమెను ఎత్మద్ పూర్ దగ్గర వదిలిపెట్టారు. ఘటన షాక్ నుంచి తేరుకున్న ఆమె ఎలాగోలా ఓ ఆటోను పట్టుకుని ఫిరోజాబాద్ కు వెళ్లిపోయింది. బుధవారం ఉదయం ఎత్మద్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టోల్ ప్లాజా దగ్గరున్న సీసీటీవీ కెమెరాల్లో ట్యాక్సీని గుర్తించారు పోలీసులు. వారిని పట్టుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

ఇదిలా ఉండగా, తెలంగాణలోని మెదక్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అమ్మాయిల మీద అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. కామాంధులు రెచ్చిపోతున్నారు. గుడి, బడి అని తేడా లేకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. చిన్నా,పెద్దా తేడా లేకుండా అమ్మాయి కనిపిస్తే చాలు కిడ్నాప్ లు చేసి, సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అలాంటి ో దారుణ ఘటనే మెదక్ లో వెలుగు చూసింది. 

మద్దూరు మండలం లాడ్నూరు గ్రామానికి చెందిన ఓ మూగ యువతిపై కామాంధులు రెచ్చిపోయారు. 23 యేళ్ల ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం రాత్రి కారులో వచ్చిన కొందరు యువకులు యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. ఆ తరువాత గ్రామశివార్లలోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. 

కూతురును కారులో బలవంతంగా తీసుకుపోవడం గమనించిన తండ్రి.. వారి వెంట పడ్డాడు. కాగా కారులో ఆకునూరు గ్రామానికి చెందిన కనకస్వామి, నరేష్ అనే వ్యక్తులు కనిపించారు. ఈ వివరాలను పోలీసులకు యువతి తండ్రి ఫిర్యాదులో తెలిపాడు. ఘటన మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios