స్టార్ హోటల్ లో.. యువతి శవం

Woman found dead under mysterious conditions in 5-star Delhi hotel
Highlights


బాయ్ ఫ్రెండ్ తో కలిసి హోటల్ కి వెళ్లి..

స్టార్ హోటల్ కి బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్లిన ఓ యువతి  శవమై కనిపించింది. ఈ దారుణ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. కాగా.. యువతిది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ షహదర ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడికి ఉత్తరాఖండ్ కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి కామన్ స్నేహితుడి ద్వార పరిచయమైంది. యువతీ,యువకులిద్దరూ కలిసి మయూర్ విహార్ ప్రాంతంలోని లగ్జరీ హోటల్ లో దిగారు. 

అనంతరం యువకుడి తండ్రి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరడంతో అతను మళ్లీ రేపు వస్తానంటూ హోటల్ లో గాళ్ ఫ్రెండ్ ను ఒంటరిగా వదిలి వెళ్లాడు. రెండోరోజు యువకుడు తన గాళ్ ఫ్రెండ్ కు ఫోన్ చేస్తున్నా సమాధానం ఇవ్వక పోవడంతో విషయాన్ని హోటల్ సిబ్బందికి చెప్పాడు. 

హోటల్ సిబ్బంది గది తలుపు కొట్టగా సమధానం లేకపోవడంతో మాస్టర్ కీ సాయంతో గది తలుపులు తెరచి చూడగా అపస్మారక స్థితిలో బాలిక కనిపించింది. హోటల్ సిబ్బంది బాలికను ఆసుపత్రికి తరలించాగా అప్పటికే మరణించిందని వైద్యులు చెప్పారు. 

ఉత్తరాఖండ్ కు చెందిన ఈ బాలిక ఢిల్లీ చాణిక్యపురిలోని బంధువుల ఇంట్లో ఉంటూ బ్యూటీపార్లర్ లో పనిచేస్తుందని పోలీసులు చెప్పారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే ఆమె మృతికి కారణమేమిటో తెలుస్తుందని ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ పంకజ్ సింగ్ చెప్పారు.

loader