సడెన్ గా ఇంట్లో ఉండాల్సిన భార్య కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్లిందో అర్థం కాలేదు. తెలిసిన చోటల్లా వెతికాడు. బంధువులకు ఫోన్ చేసి ఆరా తీశాడు. ఎక్కడా తన ఆచూకీ లభించలేదు. దీంతో..  భార్యను వెతకడానికి తన స్నేహితుడి సహాయం తీసుకుందామని అతని ఇంటికి వెళ్లాడు. అక్కడ కినపించిన ఓ దృశ్యం చూసి అతను షాకయ్యాడు.

అక్కడ స్నేహితునితోపాటు. తన భార్య మృతదేహం కూడా పడివుండటాన్ని చూసి షాకయ్యాడు. ఈ ఘటన మహరాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. థానే జిల్లాలోని అంబర్‌నాథ్‌లోగల ఒక ఫ్లాట్‌లో ఒక పురుషుడు, ఒక మహిళ మృతదేహాలు పోలీసులకు లభ్యమయ్యాయి. 

మృతురాలిని 36 ఏళ్ల జయంతిషాగా గుర్తించారు. ఆమె నవంబరు 17 నుంచి కనిపించడం లేదని ఆమె భర్త అజీత్... శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మరో మృతదేహం అజీత్ స్నేహితుడు 39 ఏళ్ల సందీప్ సక్సేనాదిగా పోలీసులు గుర్తించారు. సందీప్ తొలుత జయంతిని హత్య చేసి, తరువాత తాను గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకునివుంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

ఈ ఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ అజీత్, సందీప్ ఒకే ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారని. వీరి మధ్య స్నేహం ఉండటంతో ఒకరింటికి మరొకరు వచ్చిపోతుండేవారన్నారు. తరువాత సందీప్‌కు అజీత్ భార్య జయంతితో స్నేహం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న అజీత్ తన భార్యను మందలించాడు. ఈ నేపధ్యంలో ఆమె ఇంటి నుంచి మాయమయ్యింది. ఇదే సమయంలో అజీత్... సందీప్‌కు ఫోను చేశాడు. అయితే అటు నుంచి ఫోను తీయకపోవడంతో, అనుమానం వచ్చిన అజీత్ తన స్నేహితుని ఇంటికి వెళ్లాడు. అక్కడ సందీప్‌, జయంతిల మృతదేహాలు కనిపించాయి. దీంతో అజీత్ ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు.