తనతో మాట్లాడాలని, ఛాటింగ్ చేయాలని తన పై అధికారి వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరులో కలకలం రేపింది. 

మైసూరు : ఉన్నత చదువులు చదువుకుని కూడా ఖాళీగా ఉండడం ఎందుకని ఉద్యోగంలో చేరిన ఓ మహిళకి ఆమె అందమే ఆమె పాలిట శాపంగా మారింది. కామాంధుడైన ఉన్నతాధికారి వేధింపులతో బలవన్మరణానికి పాల్పడింది. చిన్నపాటి ఉద్యోగంలో చేరి తన చదువుకు కాస్తయినా సార్ధకత సాధిద్దామని అనుకున్న ఆమెకి కామాంధుని వేధింపులు మృత్యుపాశంలా తయారయ్యాయి. సెస్కాంలో ఉన్నతాధికారి వేధింపులను తట్టుకోలేక మహిళా కంప్యూటర్ ఆపరేటర్ పురుగుల మందు తాగి బలవన్మరణం చెందింది.

మంగళవారం నాడు ఈ ఘటన కొడగు జిల్లా మడికేరి వద్ద జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. మడికేరి తాలూకా కగ్గోడ్లు గ్రామానికి చెందిన సౌమ్య అనే మహిళ మడికేరి సెస్కాం కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధుల్లో చేరారు. సెస్కాంలో సహాయక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేస్తున్న పవన్ అనే వ్యక్తి ఆమె మీద కన్నేశాడు. దీంతో ఆమెపై వేధింపులకు తెరతీశాడు.

ఏడో తరగతి బాలికపై స్నేహితుడి తండ్రి అత్యాచారం.. మనస్థాపంతో బాధితురాలి ఆత్మహత్య..

తనకు ఫోన్ చేయాలంటూ.. తనతో వాట్సాప్ లో చాటింగ్ చేయాలి అంటూ సౌమ్యను తరచుగా వేధించేవాడు. ఈ మేరకు సౌమ్య భర్త.. రిటైర్డ్ జవాన్ పోలీసులకు తెలిపారు. ఎన్నిసార్లు సౌమ్య దీనికి నిరాకరించినా వినయ్ వేధింపులు ఆగలేదు. అతను తన వేధింపులను అలాగే కొనసాగిస్తుండడంతో సౌమ్య విరక్తి చెందింది. ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె భర్త మడికేరి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఏఈఈ వినయ్ మీద కేసు నమోదు చేశారు. 

ఇదిలా ఉండగా, మార్చి 11న తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రియుడి వేధింపులు భరించలేక ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం నాడు ఈ ఘటన వెలుగు చూసింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…మృతురాలు పల్లవి (21). వండర్ లాలో ఉద్యోగం చేస్తోంది. 

హైదరాబాద్ మూసాపేటకు చెందిన ఎలుక క్రాంతి అనే యువకుడు కొంగరకలాన్ లో ఉండే తన అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం క్రాంతి, పల్లవిల మధ్య పరిచయం ఏర్పడింది. వండర్ లాలో తనతో పాటు కలిసి పనిచేస్తున్న ప్రణయ్ అనే వ్యక్తితో పల్లవికి పరిచయం ఉంది. ఈ క్రమంలోనే ప్రణయ్ తో పల్లవి చనువుగా ఉంటుందని.. ఫోన్లు మాట్లాడుతుందని.. చాటింగ్ లు చేస్తుందని క్రాంతి అనుమానించాడు. 

ఈ విషయం మీదే గత రెండు నెలలుగా ఇద్దరు మధ్య గొడవలు మొదలయ్యాయి. గురువారం నాడు.. క్రాంతి, పల్లవిని బెదిరించాడు. ‘నీ బాగోతం అంతా నాకు తెలుసు. నీ విషయం అందరికీ చెప్పి పరువు తీస్తా’ అని బెదిరించాడు. అయితే, క్రాంతి మాట్లాడిన మాటలతో పల్లవి తీవ్రమనస్థాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే.. ‘ఐ లవ్ యు.. లాస్ట్ మెసేజ్’ అని క్రాంతికి వాట్స్అప్లో మెసేజ్ చేసింది. ఆ తర్వాత ఊరి చివరికి వెళ్లి.. అక్కడ ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పల్లవి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న డిసిపి శ్రీనివాస్ ఇబ్రహీంపట్నం ఏసిపి ఉమామహేశ్వర రావు…పల్లవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.