ఆగ్రాలో దారుణం జరిగింది. ఓ బాలికపై ఆమె స్నేహితుడి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. 

స్త్రీలకు రక్షణ లభించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నాయి. కానీ అవేవీ కామాంధులకు భయం కలిగించడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ఆడవారిపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. దివ్యాంగులు అని జాలి కూడా చూపకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి ఓ అత్యాచార ఘటన వెలుగు చూసింది. ఓ బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు.

Delhi Liquor Scam: న్యాయ నిపుణులతో కవిత చర్చలు ,ఈడీకి సమాచారం పంపిన ఎమ్మెల్సీ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్రాకు చెందిన 14 ఏళ్ల బాలికపై ఆమె స్నేహితుడి తండ్రి (45) కొంత కాలం కిందట లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు పొలంలో పనిచేస్తుండగా ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక ఈ దారుణానికి ఒడిగట్టింది. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. నిందితుడిని స్థానిక రాజకీయ కార్యకర్త రాఘవేంద్ర సింగ్ గా గుర్తించారు.

హృదయవిదారకం.. యజమాని చనిపోయి 3 నెలలైనా.. ఆస్పత్రి ఎదుటే పెంపుడుకుక్క ఎదురుచూపు...

పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితుడిపై పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం) సెక్షన్లను ఎఫ్ఐఆర్ లో చేర్చామని, అలాగే సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కేసు నమోదు చేసినట్టు డీసీపీ సోనమ్ కుమార్ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించామని తెలిపారు.

నాటు నాటు స్టెప్పులు ఆ హీరోలు ఎప్పుడో వేశారా..?

ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ.. రాఘవేంద్ర అసభ్యకర చర్యల గురించి తన కూతురు తెలిపిందని అన్నారు. అయితే అప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఉంటోందని, కుటుంబంతో కలవడం మానేసిందని బాధితురాలి పేర్కొన్నారు. అయితే తాను ఆమెకు పూర్తి మద్దతు ఇచ్చానని తెలిపారు. కూతురు భవిష్యత్తుకు భయపడి పోలీసులను ఆశ్రయించలేదని చెప్పారు. ఆత్మహత్యకు ముందు బాలికకు వచ్చిన చివరి కాల్ నిందితుడిదేనని పోలీసులు అధికారి తెలిపారు. గత కొన్ని రోజులుగా అతడు పదేపదే బాలికకు కాల్ చేస్తున్నట్టు కాల్ రికార్డులు చెబుతున్నాయని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం నివేదించింది.