Asianet News TeluguAsianet News Telugu

భార్యను 15యేళ్లుగా వేధిస్తూ, అబార్షన్ మీద అబార్షన్లు చేయిస్తూ.. చివరికి విషం తాగించి.. ఓ భర్త పైశాచికత్వం..

జాంజ్ గీర్  పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న  దేవ నారాయణ్  తన భార్యకు poison ఇచ్చి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతే కాదు అతను గత 15 ఏళ్లుగా తన భార్యను Harassment చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇదేవిధంగా భార్యకు ఎనిమిదిసార్లు Abortion చేయించాడు.  

Woman forced to abort 8 times, given poison husband harassment in Chhattisgarh
Author
Hyderabad, First Published Oct 25, 2021, 10:28 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రోజురోజుకూ మహిళల మీద దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కట్టుకన్న భార్య అని కనికరం లేకుండి చిత్రహింసలకు గురి చేస్తూనే ఉన్నారు. కాలం మారుతున్న ఈ పరిస్థితిలో మార్పు రావడం లేదు. భార్యల  మీద భర్తలు సాగించే ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. 

తాజాగా Chhattisgarh లో ఒక భర్త  చేసిన ఇలాంటి పైశాచికత్వ ఘటన  వెలుగుచూసింది.  రాష్ట్రంలోని జాంజ్ గీర్ చంపా జిల్లాకు చెందిన ఒక భర్త భార్యపై అత్యంత పాశవికంగా దాడి చేశాడు.

జాంజ్ గీర్  పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న  దేవ నారాయణ్  తన భార్యకు poison ఇచ్చి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతే కాదు అతను గత 15 ఏళ్లుగా తన భార్యను Harassment చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

ఇదేవిధంగా భార్యకు ఎనిమిదిసార్లు Abortion చేయించాడు.  బాధితురాలి తల్లి రష్మీ ల భాయి తన  అల్లుని ఆగడాలపై ఫిర్యాదు  చేస్తూ,  అతని పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 15 ఏళ్ల క్రితం తన కుమార్తెకు ఖోఖ్రా గ్రామనివాసి దేవి నారాయణి తో వివాహం జరిగిందని కొన్నాళ్ల తర్వాత అల్లుడు మద్యానికి బానిస అని తెలిసిందన్నారు. 

తరచూ తమ కుమార్తెను  వేధించేవాడు అని,  ఏ పని చేసేవాడు కాదని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.  దీంతో తన కుమార్తె కూలీ పనులు చేస్తూ సంసారాన్ని నెట్టుకు వచ్చేదని,  ఇటీవలి కాలంలో పలు వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయని చివరికి తన కుమార్తె చేత విషం కూడా తాగించాడని అన్నారు.

అయితే తాము వెంటనే తమ కుమార్తెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది అన్నారు. దేవ్ నారాయణ్‌ను  కఠినంగా శిక్షించాలని ఆమె కోరుతున్నారు.

ఇదిలా ఉంటే మరో సంఘటనలో... మైనర్ యువకుడు 26 యేళ్ల యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని.. అమ్మేశాడు..
అతనికి 17 ఏళ్లు.. ఆమెకు 26 ఏళ్లు.. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా  మారింది. దీంతో వారిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లైనా నెల రోజుల తర్వాత ఆ మైనర్ యువకుడు తన భార్యను రూ. 1.80 లక్షలకు వేరే వ్యక్తికి అమ్మేశాడు. 

ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఒడిశాకు చెందిన యువకుడికి తనకంటే వయసులో పెద్దదైన  మహిళ మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరు ఈ ఏడాది జూలైలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే దంపతులు ఇద్దరు ఇటుక బట్టీలో పని చేయడానికి రాయ్‌పూర్, ఝాన్సీ మీదుగా రాజస్థాన్ వెళ్లారు. 

అక్కడ కొన్ని  రోజులు పనిచేసిన  తర్వాత.. మైనర్ యువకుడు తన భార్యను రాజస్తాన్‌లోని బరన్ జిల్లాకు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి  అమ్మేశాడు. అతని వద్ద నుంచి లక్షా  80 వేల రూపాయలు తీసుకున్నాడు. అనంతరం ఆ డబ్బులతో స్మార్ట్‌ఫోన్ కొనుకున్నాడు. మహిళ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

read moreఅతడికి 17.. ఆమెకు 26.. పెళ్లి చేసుకున్న నెల రోజుల తర్వాత భార్యను అమ్మేశాడు.. చివరకు..
 

Follow Us:
Download App:
  • android
  • ios