ఒక మహిళ టాయిలెట్‌కు వెళ్లి లోపల దాచిన చిన్న కెమెరాను చూసి షాకయ్యింది. వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా కెమెరాతో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. రీచా చద్దా అనే యువతి పుణేలోని హింజావాడి ఏరియాలోని కేఫ్ బిహైవ్‌కు టీ తాగేందుకు వెళ్లింది. రెస్ట్ రూమ్‌కు అని వెళ్లిన సదరు మహిళ టాయ్‌లెట్‌లో కెమెరా ఉన్నట్లు గుర్తించి వాటిని ఫోటోలు తీసుకుంది.

ఇదే విషయాన్ని మేనేజ్‌‌మెంట్ దృష్టికి తీసుకురాగా ఆమెను 10 నిమిషాలు బయటికి పంపించి వెంటనే కెమెరాను అక్కడి నుంచి తొలగించారు. దీనితో పాటు విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు గాను తనకు లంచం కూడా ఇచ్చేందుకు వారు ప్రయత్నించారని రీచా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

Also Read:బెడ్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా: మెయిల్ హ్యాక్ చేసి అశ్లీల మేసేజ్‌లు

దీనిపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందించారు. కేఫ్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు మండిపడుతున్నారు. ఈ ఘటనపై పుణే నగర పోలీసులు స్పందించారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు సమాచారం అందించామని.. కేఫేపై తగిన చర్యలు తీసుకునే విధంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని వారు వెల్లడించారు. 

కొద్దిరోజుల క్రితం భార్యకు తెలియకుండా బెడ్‌రూమ్‌లో సీక్రెట్‌‌గా కెమెరాను అమర్చాడు ఓ భర్త. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రంలోని  సదాశివనగర్‌లో ఓ డాక్టర్‌ మహారాష్ట్రకు చెందిన రిత్విక్ హెగ్డేను వివాహం చేసుకొంది. ఈ దంపతులకు నాలుగేళ్ల కొడుకు కూడ ఉన్నాడు.  భార్యకు తెలియకుండానే బెడ్‌రూమ్‌లో‌ ‌సీసీటీవీ కెమెరాను అమర్చాడు.  భార్యతో శృంగారాన్ని వీక్షించే ఉద్దేశ్యంతో ఈ కెమెరాను అమర్చాడు. 

అంతేకాదు భార్యకు తెలియకుండానే ఆమె ఈ మెయిల్‌ను హ్యాక్ చేసిన రిత్విక్  ఆమె స్నేహితులకు అశ్లీల మెసేజ్‌లను పంపాడు. ఈ విషయాన్ని పసిగట్టిన భార్య భర్తను ప్రశ్నించింది.

దీంతో భార్యపై భర్తతో పాటు అత్తా మామలు  దాడికి పూనుకొన్నారు. ఆమెను ఇంటి నుండి బయటకు పంపారు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:షాక్: అమ్మాయిల బాత్‌రూమ్, బెడ్‌రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలు

తమిళనాడులోని చెన్నైకి  చెందిన సంపత్‌రాజ్ అలియాస్ సంజయ్ అడంబాక్కలో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా హస్టల్‌ను ఏర్పాటు చేశాడు.  ఈ హాస్టల్‌లో నెల రోజులకు  రూ. 5,500లను వసూలు చేసేవాడు.

సెక్యూరిటీ అడ్వాన్స్ కింద రూ, 20వేలు డిపాజిట్ గా తీసుకొనేవాడు.  యువతులు  ఉండే గదులు, బాత్‌రూమ్‌లలో రహస్యంగా కెమెరాలను ఏర్పాటు చేసి  వారి కదలికలను  రహస్యంగా గమనించేవాడు.

ఓ రోజు ఓ యువతి ప్లగ్ బోర్డులో హెయిర్ డ్రయర్  పెట్టేందుకు ప్రయత్నిస్తే  సాధ్యం కాలేదు.   అయితే  ప్లగ్ బోర్డులో  ఏముందనే విషయమై వెతికితే  చిన్న కెమెరా ఉన్న విషయాన్ని ఆ  యువతి గుర్తించింది. వెంటనే  ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు హాస్టల్‌లో నిశితంగా పరిశీలించారు. తొమ్మిది రహస్య కెమెరాలు లభించాయి.