ఓ బ్యాంక్ ఉద్యోగి వెలగబెడుతున్న రాసలీలలను అతని భార్యే బయట ప్రపంచానికి ప్రదర్శించింది. భర్త సెల్ ఫోన్ లోని దాదాపు 2000 అశ్లీల వీడియోలను ఆమె బయటపెట్టింది.  ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడు తిరుచ్చి జిల్లాకు చెందిన ఎడ్విన్ జయకుమార్(36) పుదుకోట్టై జిల్లాలోని ఓ బ్యాంకులో  క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. తంజావూరుకు చెందిన మహిళ(32) తో ఆయనకు రెండు నెలల క్రితం వివాహమైంది. ఆ సమయంలో నగలు, నగదు భారీగా  కట్నంగా తీసుకున్నాడు.

అయితే... పెళ్లైనా కూడా జయకుమార్.. తన భార్యతో సన్నిహితంగా ఉండకపోవడం గమనార్హం. ఎప్పుడు చూసినా.. సెల్ ఫోన్ లో వీడియోలు చూస్తూ కాలక్షేపం చేసేవాడు. ఈ నేపథ్యంలో భార్య వద్ద ఉన్న బంగారం కావాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

Also Read తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి, 26 మందికి గాయాలు..

భర్త అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలీక... అనుమానంతో అతని ఫోన్ చెక్ చేసి ఆమె  షాకయ్యింది. ఆ ఫోన్ లో దాదాపు 200 అశ్లీల వీడియోలు కనిపించాయి. అనేకమంది మహిళల బ్యాంక్ ఖాతాల వివరాలు అందులో ఉన్నాయి.

అంతేకాకుండా బ్యాంకుకు వచ్చే మహిళా ఖాతాదారులు, ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉండే మహిళల అసభ్య వీడియోలు కనిపించడంతో షాకైంది. వెంటనే ఈ విషయాన్ని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. భార్యకు నిజం తెలిసిపోయిందని ముందే గ్రహించిన జయకుమార్... తన దగ్గర ఉన్న వేరే 13 సెల్ ఫోన్లలోని వీడియోలను డిలీట్ చేయడం గమనార్హం. రుణాల కోసం బ్యాంక్ కి వచ్చే మహిళలను ట్రాప్ చేసి.. వాళ్ల అవసరాన్ని ఆసరాగా చేసుకోని తన కోరిక తీర్చకునేవాడని విచారణలో తేలింది. వాటిని వీడియోలు తీసి మళ్లీ బ్లాక్ మెయిల్ చేసేవాడు.

భార్యకు ఈ విషయం తెలిసిపోవడంతో.. అతను పరారయ్యాడు. అతనికి ఇలాంటి వీడియోలు సేకరించడానికి మరో బ్యాంక్ ఉద్యోగిని సహకరించింది. దీంతో... ఆమెను విచారిస్తున్నారు. పరారీలో ఉన్న బ్యాంకు ఉద్యోగి జయకుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.