విహారయాత్రలో సెల్ఫీ తీసుకోబోయి ప్రమాదవశాత్తు లోయలో పడి మహిళ మరణించిన విషాద సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఇండోర్ లో నివసించే నీతూ మహేశ్వరి అనే మహిళ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లింది.

నీతూ కుటుంబం ఇండోర్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న జామ్ గేట్ ప్రాంతానికి పిక్నిక్ కు వెళ్లారు. పిక్నిక్ స్పాట్ వద్ద సెల్ఫీ క్లిక్ చేస్తున్నప్పుడు కాలుజారి నీతూ లోయలో పడిపోయింది. 

వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నాలుగు గంటలపాటు లోయలో గాలింపు చేపట్టారు. నాలుగు గంటల తరువాత నీతూ మృతదేహం లభ్యమయిందని పోలీసులు తెలిపారు.

కొండపైనుండి కింద పడడంతో నీతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.