Asianet News TeluguAsianet News Telugu

చిరిగిన రూ.20 నోటు కోసం వాగ్వాదం.. మంటలంటుకుని మహిళ మృతి..

రాయచూరు లో చిరిగిన రూ.20 రూపాయలకోసం జరిగిన గొడవ ఓ మహిళ ప్రాణాలు తీసింది. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. 

woman died in a conflict over rs.20 in karnataka
Author
First Published Oct 26, 2022, 6:51 AM IST

రాయచూరు : చిరిగిన రూ.20 నోటు విషయంలో జరిగిన గొడవ కర్ణాటకలో ఒకరి ప్రాణాలు తీసింది. రాయచూరు సింధనూరులోని గీతా క్యాంపులో గల మహిళ దుకాణం పెట్టుకుని జీవిస్తోంది. రుక్కమ్మ అనే మహిళ కుమార్తె మల్లమ్మ దుకాణానికి వెళ్లగా.. ఆమెకు మల్లమ్మ చిరిగిన 20 రూపాయల నోటు ఇచ్చింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఈ క్రమంలో దుకాణంలో ఉన్న పెట్రోల్ ప్రమాదవశాత్తు ఇద్దరి మీదా పడింది. అయినా వారు అలాగే గొడవ పడుతూనే ఉన్నారు. 

ఇంతలో పెట్రోల్ కు దీపం తగిలింది. మంటలు అంటుకున్నాయి. ఒంటిమీద పెట్రోల్ పడడంతో ఆ మంటలు వీరిద్దరికీ వ్యాపించాయి. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే మంటలు ఆర్పి... మల్లమ్మను బళ్లారి లోని ఓ ఆసుపత్రిలో, రుక్కమ్మను రాయచూరు లోని ఆసుపత్రిలో చేర్పించారు. రుక్కమ్మ చికిత్స పొందుతూ మరణించింది. 

మహిళలను 'ఐటెమ్' అని పిలువడం నేరమే.. నిందితుడికి ఏడాదన్న జైలు శిక్ష విధించిన ముంబాయి కోర్టు

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే జులై 17న హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్, లక్డీకాపూల్, టెలిఫోన్ భవన్ సమీపంలోని బస్టాండ్ వద్ద జూలై నెల 24న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మధ్య మండలం డీసీపీ రాజేంద్ర చంద్ర, అడిషనల్ డిసిపి రమణారెడ్డి, ఏసీపీ వేణుగోపాల్ రెడ్డితో కలిసి దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

జహీరాబాద్, రామ్ నగర్ కు చెందిన బోయిన మహేష్ కర్ణాటక రాష్ట్రం, కలబుర్గి జిల్లా, డంజార్గావ్ కు చెందిన జె. అనిల్ కుమార్ బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. అడ్డా కూలీలుగా పనిచేసుకుంటూ.. ఫుట్పాత్లపై నివాసం ఉండేవారు. ఈ క్రమంలో ఫుట్ పాత్ లపై పడుకున్న వ్యక్తులను బెదిరించి, డబ్బులు లాక్కుని జల్సాలు చేసేవారు. జూలై 24న లక్డీకాపూల్ బస్ స్టాప్ వద్ద నిద్రిస్తున్న ఓ యాచకుడిని టార్గెట్ చేసుకున్నవారు.. కత్తితో అతడి గొంతు కోసి, జేబులో ఉన్న160 రూపాయలు నగదును తీసుకొని పారిపోయారు. 

రక్తం మడుగులో ఓ వ్యక్తి కొట్టుమిట్టాడుతున్నాడు అంటూ.. పోలీసులకు సమాచారం అందడంతో.. సైఫాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని.. బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం అతను మృతి చెందాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు బోయిన మహేష్, జె. అనిల్ కుమార్ లను నిందితులుగా గుర్తించారు. 

నాంపల్లి, బజార్ ఘాట్ లోని కాలభైరవ దేవాలయం వద్ద వారిని అదుపులోకి తీసుకుని విచారించగా... నిందితులు నేరం అంగీకరించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని మరింత సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని డిసిపి తెలిపారు. కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ సత్తయ్య, ఎస్సై మాధవి, కానిస్టేబుళ్లు అజీముద్దీన్, అహ్మద్ షా ఖాద్రీలను డీజీపీ అభినందించారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లకు నగదు రివార్డులను అందజేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios