Asianet News TeluguAsianet News Telugu

మహిళలను 'ఐటెమ్' అని పిలువడం నేరమే.. నిందితుడికి ఏడాదన్న జైలు శిక్ష  విధించిన ముంబాయి కోర్టు

ముంబాయి ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.  అమ్మాయిని ఐటమ్‌ అని పిలువడం, పిలిచి జుట్టు లాగడం లైంగిక వేధింపుల కిందికే వస్తుందని ముంబైలోని ప్రత్యేక కోర్టు పేర్కొంది. ఇది ఆమె నిరాడంబరతను ఉల్లంఘించమేనని పేర్కొంది.  అలాగే ప్రొబేషన్ ఆఫ్ క్రిమినల్ యాక్ట్ కింద సత్ఫ్రవర్తన ప్రవర్తన కారణంగా అతడిని విడుదల చేసేందుకు నిరాకరించింది.
 

Mumbai Special Court Said Calling Girls Item Pulling Hair Are Sexual Harassment
Author
First Published Oct 26, 2022, 6:25 AM IST

ముంబాయి ప్రత్యేక సంచలన తీర్పు ఇచ్చింది.  మహిళను 'ఐటెమ్‌' అని సంబోధించడం, జట్టు పట్టి లాగడం కూడా లైంగిక వేధింపుల కిందకే వస్తుందనీ, అది కూడా క్షమించరాని నేరమని ముంబాయి హైకోర్టు పేర్కొంది. పాఠశాల వెళ్తున్న బాలికను ఓ యువకుడు ఓయి ఐటెమ్‌ అని సంబోధించడాని దోషిగా పేర్కొన్న ప్రత్యేక కోర్టు ఏడాదన్న జైలు శిక్ష విధించింది. మహిళను ఐటెమ్‌ అని పిలవడం ఆమె నిరాడంబరతను ఉల్లంఘించడమేననీ, దానిని నేరంగా పరిగణించొచ్చని స్పష్టం చేసింది. 

వివరాల్లోకెళ్తే.. ముంబాయిలోని శాకినాకాలో నివసించే 16 ఏళ్ల బాలిక అదే ప్రాంతంలోని అబ్రార్‌ ఖాన్(25) అనే యువకుడు వేధింపులకు గురి చేశారు. ఆ బాలిక పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఐటెమ్‌ అని పిలిచి.. ఆ  బాలిక జుట్టు పట్టుకొని లాగాడు . దీంతో ఆమె 100కు ఫోన్‌ చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ బాలిక ఫిర్యాదు మేరకు ఆ యువకుడి పై కేసు నమోదు చేశారు. కానీ నిందితుడికి ముందస్తు బెయిలు పోందారు.

దీంతో ఆ బాలిక కోర్టును ఆశ్రయించారు. ఆ బాలిక పిటిషన్ స్వీకరించిన జస్టిస్‌ ఎస్‌జె అన్సారి నేత్రుత్వంలోని ముంబాయి హైకోర్టు..  ముందు నిందితుడు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బాధితురాలు, నిందితుడు   ఇద్దరూ స్నేహితులేనని తెలిపారు.బాలిక తల్లిదండ్రులకు అది ఇష్టం లేక కావాలనే తప్పుడు కేసు పెట్టిందని పేర్కొన్నారు.

కానీ,,బాధితురాలి వాంగ్మూలం విన్న కోర్టు..నిందితుడి ప్రవర్తన సరికాదని పేర్కొంది. ఓ బాలికను ఐటెమ్‌ పిలవడం ఆమెను అగౌరవపరచడమేనని, ఆమె నిరాడంబరతను ఉల్లంఘించినట్లేనని కోర్టు పేర్కొంది. నిందితుడు నేరపూరితంగా వ్యవహరించినట్లు స్పష్టం చేసింది. ఓ బాలికను ఉద్దేశపూర్వకంగా ఐటెమ అని పిలవడం,  బాధితురాలి జుట్టు పట్టుకొని లాగడం..ఆ నిందితుడి ఆగ్రహాన్ని రుజువు చేస్తోందని పేర్కొంది.ఐపిసి  354, పోక్సో చట్టంలోని సెక్షన్‌ 12 కింద నిందితుడిని దోషిగా పేర్కొంటూ.. ఏడాదన్నర జైలు ఖరారు చేసింది.

మహిళల రక్షణ నిమిత్తం ఈ తరహా నేరాలపై కఠినంగా వ్యవహరించాలని,మహిళలను అవాంఛనీయ ప్రవర్తన నుండి రక్షించడానికి వీధి రైడర్‌లకు గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. నిందితుడిపై విచారణ జరపడం అంటే అతని  పట్ల అనుచితంగా కనికరం చూపినట్లేనని 28పేజీల తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios