Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ బస్సులోనే పురిటి నొప్పులు, మహిళ ప్రసవం.. నెలలు నిండని శిశువు మరణం

హర్యానాలో ఓ మహిళ బస్సులో ప్రయాణిస్తూ ప్రసవించింది. మార్గం మధ్యలోనే ఆమెకు పురిటినొప్పులు రావడంతో బస్సులోని కొందరు మహిళలు ఆమె ప్రసవించేలా సహాయపడ్డారు. అయితే, నెలలు నిండకముందే శిశువును కనడంతో ఆ నవజాత శిశువు మరణించింది. డ్రైవర్ నేరుగా బస్సును హాస్పిటల్ తీసుకెళ్లారు. శిశువు మరణించిందని వెల్లడించిన వైద్యులు ఆమెను హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నారు.
 

woman delivers premature baby in haryana bus, baby dies
Author
First Published Jan 29, 2023, 3:25 AM IST

అంబాలా: హర్యానా రోడ్‌వేస్ బస్సులో ఓ మహిళ ప్రసవించింది. అంబాలా నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ముల్లానా సమీపంలో ఆమె ప్రసవించింది. నెలలు నిండకుండానే శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు మరణించింది. ఆ మహిళను హాస్పిటల్‌లో చేర్చారు. నెలలు నిండకుండా జన్మించడం వల్ల ఆ శిశువు మరణించినట్టు వైద్యులు తెలిపారు. 

ఆ గర్భిణి తన భర్త, ఇద్దరు పిల్లలు, మరో బంధువుతో కలిసి బస్సు ఎక్కినట్టు బస్సు డ్రైవర్ సలీమ్ ఖాన్ తెలిపారు. అంబాలా నుంచి సహరన్‌పూర్ వెళ్లడానికి బయల్దేరారు. అయితే, మార్గం మధ్యలోనే ఆ గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయని వివరించారు. ముల్లానాకు చేరగానే ఆమె నొప్పులు పెరిగాయని తెలిపారు. 

Also Read: స్కూటీ యాక్సిడెంట్‌ బాధితులను రక్షించడానికి వెళ్లారు.. వారి పైకి ట్రక్కు దూసుకెళ్లింది.. ఐదుగురు దుర్మరణం

బస్సులోని కొందరు మహిళలు ఆమెకు ప్రసవం జరిగేలా చూశారని అధికారులు తెలిపారు. బస్సు డ్రైవర్ ఆ బస్సును ముల్లానాలోని సివిల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అప్పటికే ఆమె ప్రసవించింది. హాస్పిటల్ చేరేలోపే శిశువు మరణించింది. శిశువు మరణించిందని వైద్యులు డిక్లేర్ చేశారు. ఆమెను హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకున్నారు. ఆ మహిళ నెలలు నిండకముందే ప్రసవించిందని వైద్యులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios