రైల్వే ట్రాక్‌పై తల్లి డ్యాన్స్.. కూతురు రీల్స్ రికార్డింగ్.. కట్ చేస్తే..
రైలు పట్టాలపై తల్లి తన డ్యాన్స్ చేస్తుంటే.. కూతురు రీల్ రికార్డింగ్ చేసింది. ఈ వీడియో పోలీసుల కంటబడటంతో దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఈ ఘటన ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది.
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కొంతమంది నెటిజన్లు దేనికైనా ప్రయత్నిస్తారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. రిస్క్ స్టంట్ చెయ్యడంతో పాటు అజాగ్రత్త చర్యలకు కూడా పాల్పడుతున్నారు. మొత్తానికి చిత్రవిత్ర చేష్టాలతో ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. లేదా పలువురులో అబాసు పాలవుతున్నారు. తాజాగా ఆగ్రాలో ఓ మహిళ రీల్స్ చిత్రీకరణ కోసం రైల్వే ట్రాక్ ఎక్కింది.
ఆ రీల్స్ షూట్ చేయడానికి తనతో పాటు తన కూతుర్ని కూడా వెంటబెట్టుకుని వెళ్లింది. వారు షూట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వారు అనుకున్న విధంగా వీడియో నెట్టింట్లో హల్ చల్ చేసింది. ఓ రేంజ్ లో వీడియోకు లైక్స్, కామెంట్స్ వచ్చాయి. కానీ ఊహించని విధంగా ఆ వీడియో పోలీసు ఉన్నతాధికారుల కంటబడింది. దీంతో ఆ తల్లీ, కూతుర్లను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. భవిష్యత్తులో ఇలా చేయబోమని హామీ ఇవ్వడంతో ఇద్దరికీ బెయిల్ ఇచ్చారు. ఈ ఘటన ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది.
ఈ ఘటనపై ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్ ఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎన్ పాటిదార్ మాట్లాడుతూ జూలై 21న మీనా సింగ్ పేరుతో కొన్ని వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయ్యాయి. ఈ వీడియో ఒకటి రైల్వే ట్రాక్ పై చిత్రీకరించబడింది. మీనా సింగ్ 'అబ్ తేరే బిన్ హమ్ భీ జీ లేంగే' సినిమా పాటపై వీడియో రీల్ చేసింది. సమాచారం సేకరించి ఆ మహిళను గుర్తించారు. మీనా సింగ్ పోలీస్ స్టేషన్ ఎత్మద్దౌలా శ్యామ్ విహార్ కాలనీ నారాయణచ్ నివాసి. రైల్వే చట్టంలోని సెక్షన్ 145, 147 కింద కేసు నమోదు చేసి.. మీనా సింగ్ తోపాటు తన కూతుర్ని కూడా అరెస్టు చేసినట్టు తెలిపారు.
వాస్తవానికి రైల్వే ట్రాక్‌పై నటించడం నిషేధించబడింది. మీనా సింగ్ అనే మహిళ తన కుమార్తె మేఘా అలియాస్ దీక్షతో కలిసి జూలై 20న రైల్వే ట్రాక్‌పై వీడియో చిత్రీకరించింది. సమన్లు పంపి మీనాకు ఫోన్ చేశాడు. తల్లి , కుమార్తె ఇద్దరూ హాజరయ్యారు. ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. భవిష్యత్తులో అలాంటి తప్పు చేయబోమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఒక్కొక్కరికి రూ.5,000 బాండ్‌పై బెయిల్ మంజూరు చేసింది.
మీనా సింగ్ ఓ యూట్యూబర్. ఆమె సోషల్ మీడియాలో చాలా వీడియోలను అప్‌లోడ్ చేశారు. కానీ ఇటీవల రైల్వే ట్రాక్ చేసిన వీడియోలు పోలీసుల కంటబడ్డాయి. ఇలాంటి వీడియోల వల్ల ప్రజల జీవితాలు ప్రమాదంలో పడతాయి. ఇలాంటి వీడియోలను ఫాలో అవుతున్నప్పుడు ఇతరులు కూడా అలాంటి తప్పులు చేస్తుంటారు.
వాస్తవానికి మనదేశంలో రైల్వే ప్రాంగణంలో షూటింగ్ చేయడానికి సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి అవసరం. కానీ రైల్వే ఫ్లాట్ ఫామ్స్, రైలు పట్టాలు వంటి ప్రాణాంతక ప్రదేశాలలో చిత్రీకరణ పూర్తిగా నిషేధించబడింది.