దారుణం.. భర్త మర్మాంగాలను కోసేసిన భార్య

First Published 2, Aug 2018, 10:57 AM IST
Woman chops off husband's genitals in UP
Highlights

తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే కారణంతో ఓ మహిళ.. తన భర్త మర్మాంగాలను కోసేసింది. 

తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే కారణంతో ఓ మహిళ.. తన భర్త మర్మాంగాలను కోసేసింది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ లోని మిమ్ లానా ప్రాంతంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  ముజఫర్ నగర్ లోని మిమ్ లానా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇద్దరు భార్యలు. మొదటి వివాహం జరిగి సంవత్సరాలు గడుస్తున్నా.. వారికి సంతానం కలగలేదు. దీంతో.. మొదటి భార్య సమ్మతితో మరో యువతిని వివాహం చేసుకున్నాడు.

ఇటీవల రెండో భార్యకు సంతానం కలిగింది. ఈ ఆనందంలో సదరు వ్యక్తి.. మొదటి భార్యను కాస్త నిర్లక్ష్యం చేశాడు. ఎక్కువ సమయంలో రెండో భార్యతో, బిడ్డతోనే సమయం గడిపేవాడు. ఒక్కసారిగా భర్త తనకు దూరం కావడంతో ఆమె భరించలేకపోయింది.

దీంతో.. భర్తను ఇంటికి పిలిచి.. అతనిపై దాడిచేసి... మర్మాంగాలను కోసేసింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
 

loader