Asianet News TeluguAsianet News Telugu

రూ. 2 వేల కోసం 2 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన మహిళ.. బంగ్లాదేశ్ సరిహద్దులో పట్టివేత

బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా సుమారు 2 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ సరిహద్దులో అధికారులకు చిక్కింది. గురువారం ఆమెన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పట్టుకుని ఆమె వద్ద నుంచి సుమారు రూ. 2 కోట్ల విలువైన బంగారాన్ని సీజ్ చేశారు.
 

woman caught smugging gold of around 2kg, she charged for only rs 2,000 fo task kms
Author
First Published Apr 29, 2023, 2:53 AM IST

న్యూఢిల్లీ: ఓ మహిళ 27 బంగారు కడ్డీలను బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా తరలిస్తుండగా సెక్యూరిటీ బలగాలకు చిక్కింది.  బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆమెను పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా సరిహద్దులో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ టీమ్ గురువారం పట్టుకుంది. ఆమె వద్ద నుంచి రూ. 1.29 కోట్ల విలువైన 2 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. ఆమె ఈ బంగారాన్ని కేవలం రూ. 2,000 కోసం స్మగ్లింగ్ చేసినట్టు వివరించింది.

ఈ బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఆ మహిళను 34 ఏళ్ల మనికా ధర్‌గా గుర్తించారు. 27 బంగారు కడ్డీలను ఓ క్లాత్‌లో దాచి ఆమె నడుము చుట్టూ కట్టుకుంది. ఆమె బంగ్లాదేశ్‌లోని చిట్టాంగాంగ్ జిల్లా నివాసి.

ఆమె ఇంటరాగేషన్ చేయగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బంగారాన్ని పశ్చిమ బెంగాల్‌లోని బారాసాత్‌తో ఉండే గుర్తు తెలియని వ్యక్తికి అందజేయాల్సిందిగా తనకు టాస్క్ ఇచ్చారని ఆ మహిళ తెలిపింది. తాను స్మగ్లింగ్ చేయడం ఇదే తొలిసారి అని వివరించింది. ఈ పని చేసిపెట్టినందుకు తనకు రూ. 2,000 అందుతాయని చెప్పింది.

సీజ్ చేసిన బంగారాన్ని ఆ తర్వాత పెట్రోపోల్‌లోని కస్టమ్ ఆఫీసుకు అధికారులు అందించారు. వారు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

Also Read: కర్ణాటకలో తమకు మద్దతుగా ప్రచారం చేయాలని కమల్ హాసన్‌కు కాంగ్రెస్ విజ్ఞప్తి!

బంగ్లాదేశ్ నుంచి ఓ స్మగ్లర్ బంగారాన్ని పట్టుకుని అక్రమంగా సరిహద్దు దాటి వెళ్లిపోతున్నారని తమకు సమాచారం వచ్చింది. ఇండియన్ చెక్ పోస్ట్ వద్ద బీఎస్ఎఫ్ మహిళా అధికారులు మోహరించారు. వారు ఎదురుచూస్తున్నట్టే ఓ మహిళ సరిహద్దు దాటి వచ్చింది. అనుమానంతో బీఎస్ఎఫ్ అధికారులు ఆమెను చుట్టుముట్టి సెర్చ్ చేశారు. ఆమె దుస్తుల్లో బంగారాన్నిదాచినట్టు గుర్తించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios