కర్ణాటకలో తమకు మద్దతుగా ప్రచారం చేయాలని కమల్ హాసన్‌కు కాంగ్రెస్ విజ్ఞప్తి!

ఎన్నికల రాష్ట్రం కర్ణాటకలో ప్రచారం కోసం ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం వ్యవస్థాపకుడు కమల్ హాసన్‌ను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం ఆయనకు విజ్ఞప్తి పంపగా.. ఈ ఆహ్వానంపై కమల్ హాసన్ ఆలోచనలు చేస్తున్నట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
 

congress requests kamal haasan to campaign in karnataka elections says sources kms

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపించాయి. వచ్చే నెల 10న ఎన్నికలు జరగనుండా కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో క్యాంపెయినింగ్ కోసం యాక్టర్ కమల్ హాసన్‌ను రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నది. తమ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ.. కమల్ హాసన్‌కు విజ్ఞప్తి చేసినట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్ కమల్ హాసన్ గతంలో తమిళనాడులో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. ఈస్ట్ ఈరోడ్ బైపోల్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఈవీకేఎస్ ఎలంగోవన్‌కు ఆయన తన మద్దతు ప్రకటించారు.

మరో పది రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ కమల్ హాసన్‌కు ఓ ప్రతిపాదన పంపింది. ఈ ఆహ్వానంపై కమల్ హాసన్ ఆలోచిస్తున్నారు. త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉన్నది.

Also Read: నేను మహారాష్ట్ర సీఎం కావాలనుకుంటున్నా..: కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే అభిలాష

224 సీట్ల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,613 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మే 10 ఎన్నికలు జరగ్గా మే 13న ఫలితాలు వెలువడతాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios