ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. భర్తకు తెలీకుండా భార్య... భార్యకు తెలీకుండా భర్త.. పక్క చూపులు చూస్తున్నారు. తీరా ఏదో ఒక రోజు అవి భయటపడటంతో దారుణాలకు పాల్పడుతున్నారు. కొందరైతే భరితెగించి  అడ్డుగా ఉన్నారంటూ భర్తలను కూడా చంపేస్తున్నారు. 

ఇంకొందరు కాపురాలు నాశనం చేసుకుంటున్నారు. వీరి అక్రమ సంబంధాల కారణంగా చాలా చోట్ల పిల్లలు అనాథలు మారుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా.. మరో వివేహతర సంబంధానికి సంబంధించిన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. భర్త లేని సమయంలో పాలవాడితో ఎఫైర్ పెట్టుకుంది. 

ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆమె అక్రమ సంబంధం వ్యవహారం భర్తకు తెలిసిపోయింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పుణెకు చెందిన రాణికి ఏడేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఇంతవరకు వారికి పిల్లలు పుట్టలేదు. తనకు పిల్లలు పుట్టలేదని భర్తతో తరుచు గొడవపడేది. ఈ క్రమంలో ఆమె పాలు పోసే యువకుడితో పరిచయం పెట్టుకుంది.

 భర్త ఆఫీస్ కు వెళ్లిన తర్వాత అతడిని పిలిపించుకుని రకరకాల వంటలు చేసిపెట్టేది. ఇద్దరి మధ్య చనువు పెరగడంతో అది అక్రమ సంబంధంగా మారింది. భర్త రోజు ఆఫీస్ కు వెళ్లిన తర్వాత ఇద్దరూ రాసలీలల్లో మునిగి తేలేవారు. చాలా రోజులు ఇలా ఇద్దరూ ఎంజాయ్ చేశారు.

అయితే లాక్ డౌన్ కారణంగా ఆ మహిళ భర్త ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో కొన్నాళ్లు ఇద్దరూ కలుసుకోలేకపోయారు. ఇటీవల భర్త త‌న ఫ్రెండ్ ఇంటి‌కి అని బయలుదేరాడు. మ‌ధ్యాహ్నం వస్తానని చెప్పాడు. 

భ‌ర్త మధ్యాహ్నం వరకు ఇంటికి రానని చెప్పడంతో ఇదే అదనుగా ఆ మహిళ పాల‌వాడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. అయితే దారిలో పోలీసులు ఆపేయ‌డంతో భ‌ర్త అర‌గంట‌కే ఇంటికి వ‌చ్చాడు. కాలింగ్ బెల్ కొట్టినా ఆమె డోర్ తియ్యలేదు. ఎంతసేపటికి డోర్ తియ్యకపోవడంతో అతడికి అనుమానం వచ్చింది. 

బెడ్ రూమ్ ద‌గ్గ‌ర కిటీకి నుంచి చూశాడు. అంతే షాక్ అయ్యాడు. తన భార్య, పాలవాడు న‌గ్నంగా ఉన్నారు. తన భార్యను మరో వ్యక్తితో చూసి అతను కోపంతో ఊగిపోయాడు. వెంటనే బయటి నుంచి త‌లుపులు వేసి పోలీసుల‌కి రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు. కాగా ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.