సారాంశం

ఫోన్ మాట్లాడుతుందని తండ్రి మందలించాడని ఓ యువతి 90 అడుగుల ఎత్తునుంచి జలపాతంలోకి దూకేసింది. ఈ ఘటన ఛత్తీస్ ఘడ్ లోని చిత్రకూట్ జలపాతం వద్ద వెలుగు చూసింది. 

ఛత్తీస్ ఘడ్ : తండ్రి మందలించాడని ఓ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. 90 అడుగుల ఎత్తునుంచి జలపాతంలోకి దూకేసింది. కానీ ఆ యువతి ఆయుష్షు గట్టిది. ఆమె దూకడాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే బోటులో వెళ్లి రక్షించారు. ఆ యువతి పేరు సరస్వతి మౌర్య.

ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతుందని తండ్రి ఆమెను మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన సరస్వతి మౌర్య చిత్రకూట్ జలపాతం దగ్గరికి వచ్చింది. 90 అడుగుల ఎత్తునుంచి ఉదృతంగా ప్రవహిస్తున్న జలపాతంలోకి దూకేసింది. వెంటనే గమనించిన స్తానికులు బోట్లలో వెళ్లి ఆమెను రక్షించారు. ఇదంతా అక్కడే ఉన్నవారు వీడియో తీశారు. 

ఒకే ఫ్యామిలీలో ముగ్గురి దారుణ హత్య, చిన్నారి సజీవదహనం.. బాబాయి కుటుంబంపై యువకుడి ఘాతుకం..

ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా షాక్ కు గురవుతున్నారు. పొంగిపొర్లుతున్న జలపాతపు జడిలో, హోరు శబ్దంలో ఆ యువతి చనిపోవాలనుకోవడం.. ఆమెను రక్షించడం కోసం గ్రామస్తుల సాహసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.