ఒకే ఫ్యామిలీలో ముగ్గురి దారుణ హత్య, చిన్నారి సజీవదహనం.. బాబాయి కుటుంబంపై యువకుడి ఘాతుకం..
ఓ 19యేళ్ల యువకుడు తన బాబాయి కుటుంబంపై పగ బట్టాడు. గొడ్డలితో బాబాయి, పిన్ని, వారి కోడలిని నరికి చంపాడు. వారి ఆరు నెలల చిన్నారిని సజీవ దహనం చేశాడు.

రాజస్థాన్ : రాజస్థాన్లోని జ్యోథ్పూర్ లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని గొడ్డలితో నరికి హతమార్చాడు. ఆ తర్వాత వారి ఆరు నెలల బాలికను సజీవ దహనం చేశాడు. అతను ఆ కుటుంబానికి బంధువే కావడం గమనర్హం. జోద్పూర్ జిల్లాలో ఓసియన్ ప్రాంతంలోని చెరియా గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆ సమయంలో పప్పు రామ్ (19) అనే యువకుడు తన బాబాయి పూనారం ఇంటికి వచ్చాడు. ఆ ఇల్లు పొలాల మధ్యలో ఉంది. రావడం రావడమే ఆ యువకుడు తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో పునారాం (60), అతడి భార్య భన్వారీ (55), వారి కోడలు దాపు(23)ల మీద దాడి చేశాడు. గొడ్డలితో గొంతు నరికి హతమార్చాడు. ఆ తరువాత వారి శవాలను వంట గదిలోకి తీసుకెళ్లాడు.
బ్రేకింగ్.. ఒక్కసారిగా కుప్పకూలిన తేజ్ ప్రతాప్ యాదవ్ .. తీవ్ర ఛాతీ నొప్పితో..
అక్కడ వాటిని తగలబెట్టాడు. ఆ తరువాత అతడికి ధాపు కుమార్తె ఆరు నెలల చిన్నారి మనిషా కనిపించింది. ఆ చిన్నారిని సజీవంగానే ఆ మంటల్లోకి విసిరేశాడు పప్పురామ్. కొద్ది రోజుల క్రితం గుజరాత్ లో అనుమానాస్పద స్థితిలో పప్పురాం సోదరుడు మృతి చెందాడు. తన సోదరుడు చనిపోవడంలో పూనారం హస్తం ఉండొచ్చని పప్పురాం అనుమానించాడు.
పునారామ్ కు ఇద్దరు కొడుకులు. ఒకరు రాళ్ల పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అతను నైట్ డ్యూటీకి వెళ్ళాడు. మరో కొడుకు కుటుంబంతో కలిసి ఛాములో ఉంటున్నాడు. దీంతో పప్పురాం ఆ ఇంట్లో తనను అడ్డుకునే వారు ఉండబోరని భావించాడు.అతని అంచనా ప్రకారమే అతన్ని ఎవరు అడ్డుకోలేక పోయారు. దీంతో పప్పురాం బాధితుల ఇంట్లో బీభత్సం సృష్టించాడు.
ఇంట్లోకి ప్రవేశించడంతో మొదలుపెట్టిన దాడి.. చిన్నారిని మంటల్లోకి విసిరేసి పారిపోయే వరకు కొనసాగిందని పోలీసులు తెలిపారు. దీనిమీద పోలీసు కేసు నమోదు అవ్వగా నిందితుడిని.. అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా సమాచారం.