Asianet News TeluguAsianet News Telugu

మగాడిలా మారువేషంలో వచ్చి అత్తను చితకబాదిన కోడలు.. మెడలో గొలుసు లాక్కుని దొంగల పని అనేలా... చివరికి..

ఓ కోడలు మగాడిలా మారువేషం వేసుకుని.. దొంగలా వచ్చి అత్తమీద దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన ఆ అత్త చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. 

woman attacked mother in law in Disguised as male to death in tamilnadu - bsb
Author
First Published Jun 1, 2023, 8:11 AM IST

తమిళనాడు : అత్తా కోడళ్ళ గొడవలు ప్రతి ఇంట్లో ఉండేవే.  ఓ సమయంలో అత్తది పై చేయి అయితే..  మరో సమయంలో కోడలిది పై చేయి అవుతుంది. . సామరస్యంగా సర్దుకుపోతే ఎవరిది పై చేయి అయినా.. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా ప్రతీ విషయంలోనూ తప్పులు పట్టుకుంటూ పోతే.. శృతి మించితే దారుణాలకు దారితీస్తుంది. అలాంటి అమానవీయ ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది.

అత్త మీద తీవ్ర కోపంలో ఉన్న ఓ కోడలు.. మారువేషంలో వచ్చి  ఆమె మీద తీవ్రదాడికి పాల్పడింది. సినిమాల్లో ఇలాంటి ఘటనలు చూసి నవ్వుకుంటాం. నిజజీవితంలో అలా చేయలేని వారు.. వాటిని చూసి కాసేపు సరదాగా నవ్వుకొని, సంతృప్తి పడి వదిలేస్తారు. కానీ ఓ కోడలు మాత్రం వీటిని నిజం చేసింది.. మారువేషంలో మగాడిలా వచ్చి  అత్తను చితకబాదింది. ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని వడుకన పట్టి గ్రామంలోచోటుచేసుకుంది.

విద్యార్థినిని కిడ్నాప్ చేసి, గ్యాంగ్ రేప్.. పెట్రోల్ పోసి, నిప్పంటించి.. కాలిన గాయాలతో మృతి...

ఈ గ్రామంలోని శణ్ముగవేలు అనే వ్యక్తి భార్య సీతారామలక్ష్మి (57). ఈ దంపతులకు రామస్వామి అనే కుమారుడు ఉన్నాడు. అతనికి  మహాలక్ష్మి అనే యువతితో వివాహం చేశారు. పెళ్లయిన రోజు నుంచి అత్తా కోడలు తరచుగా గొడవ పడుతుండేవారు. వీరిద్దరి మధ్య ఎంత చెప్పినా సయోధ్య కుదరకపోయేది. దీంతో పరిస్థితిని కాస్త మెరుగుపరచాలని భావించిన రామస్వామి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల దగ్గర నుంచి వేరే చోటికి మకాం మార్చాడు.

అయినా కూడా గొడవలు తగ్గలేదు. ఇటీవల మరో గొడవ జరిగింది. దీని తర్వాత అత్త మీద మహాలక్ష్మి తీవ్రస్థాయిలో కక్ష పెంచుకుంది. ఆమెను ఎలాగైనా అంతమందించాలని పథకం వేసింది. మామూలుగా వెడితే తాను దొరికిపోతానని.. మారువేషం వేసుకుంది. మగవారిలా వేషధారణ చేసుకుని.. తలకి హెల్మెట్ పెట్టుకుని.. అత్తింటికి వెళ్ళింది. ఆ సమయంలో అత్త నిద్రపోతుంది. ఆమె మీద  కోడలు దాడి చేసి తీవ్రంగా కొట్టింది.  

దొంగలపని అని నమ్మించాలని.. ఆమె మెడలోని బంగారు గొలుసు కూడా లాక్కుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మాయమయ్యింది. కాసేపటికి ఇంట్లోనే వారు ఆమెను చూసి తీవ్ర గాయాల పాలవడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ సీతారామలక్ష్మి మృతి చెందింది.  దీని మీద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే, సీసీటీవీలు ఉంటాయన్న విషయం కోడలు మరిచిపోయింది. 

దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు గమనించగా..  కోడలు దొరికిపోయింది. మారువేషంలో వచ్చినది కోడలేనని వారు గుర్తించారు.  దీంతో ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇంత పక్కాగా పథకం వేసినా బెడిసి కొట్టడంతో కోడలు ఉసూరుమంటూ జైలుకు తరలింది. 

Follow Us:
Download App:
  • android
  • ios