Asianet News TeluguAsianet News Telugu

విద్యార్థినిని కిడ్నాప్ చేసి, గ్యాంగ్ రేప్.. పెట్రోల్ పోసి, నిప్పంటించి.. కాలిన గాయాలతో మృతి...

ఉత్తరప్రదేశ్ లో కిడ్నాప్, అత్యాచారానికి గురైన ఓ విద్యార్థిని.. కాలిన గాయాలతో మృతి చెందింది. 

student kidnapped and gangraped, girl died with burn injuries in uttar pradesh - bsb
Author
First Published Jun 1, 2023, 7:37 AM IST

ఉత్తర ప్రదేశ్ : ఉత్తరప్రదేశ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాధితురాలు కాలిన గాయాలకు గురైంది. దీంతో గత రెండు నెలలుగా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం నాడు ప్రాణాలు విడిచింది. అత్యాచారానికి ఎదురు తిరగడంతో ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు దుర్మార్గులు. దీంతో తీవ్ర గాయాల పాలైన ఆమెను అక్కడే వదిలేసి పారిపోయారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న తండ్రి ఆస్పత్రిలో చేర్పించడంతో రెండు నెలలుగా ఆమెకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే..  ఉత్తర ప్రదేశ్ లోని జైసింగ్ పూర్ కు చెందిన ఓ విద్యార్థినిపై బహ్రీ గ్రామానికి చెందిన మహావీర్ అనే యువకుడు కన్నేశాడు. ఈ ఏడాది జనవరి 30న తన స్నేహితుల సహాయంతో ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తరువాత ఆ విద్యార్థినిని గుజరాత్ లోని సూరత్ కు తీసుకువెళ్లారు. మరోవైపు విద్యార్థిని కనిపించకపోవడంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.

బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లభించలేదు!

మహావీర్ మీద అనుమానం ఉందని.. తన  కూతురు అదృశ్యానికి అతనికి సంబంధం ఉండొచ్చని తెలపడంతో.. అతను, అతని స్నేహితుల మీద.  పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మార్చి 28న మహావీర్ అతని స్నేహితులు ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు ఎదురు తిరిగింది. కోపానికి వచ్చిన నిందితుడు ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 

ఆ తర్వాత ఈ విషయాన్ని విద్యార్థినిని కిడ్నాప్ చేసిన  మహా వీరే  స్వయంగా బాధితురాలు తండ్రికి ఫోన్ చేశాడు. అతని కూతురు తీవ్ర గాయాల పాలయిందని తెలిపాడు. దీంతో మార్చి 29న బాధితురాలు తండ్రి సుల్తాన్పూర్ ఎస్పీ సోమన్ వర్మను కలిసి.. ఘటన మొత్తాన్ని వివరించాడు.  దీంతో వెంటనే ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు సూరత్ వెళ్లారు. అక్కడ  మహావీర్ చెప్పిన గుర్తుల ప్రకారం బాధితురాలి ఆచూకీ కనుక్కుని.. ఆమెను లఖ్ నవూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా, నిందితుల కోసం పోలీసులు మూడు బృందాలుగా మారి గాలించారు.  వీరిలో ప్రధాన నిందితుడైన మహావీర్.. అతని స్నేహితుడైన ధనిరామ్ లను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అప్పటినుంచి  60 శాతానికి పైగా  కాలిన గాయాలతో బాధితురాలు చికిత్స పొందుతుంది. మంగళవారం రాత్రి  మృతి చెందింది. 

Follow Us:
Download App:
  • android
  • ios