Asianet News TeluguAsianet News Telugu

అన్నదమ్ములతో వివాహిత అక్రమ సంబంధం, రెండుసార్లు పారిపోయి, చివరికి హతమయ్యి...

తమిళనాడులో ఓ మహిళ భర్తను కాదని ఓ ఇద్దరు అన్నాదమ్ములతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. రెండుసార్లు వారిద్దరితో వేరువేరుగా పారిపోయింది. ఆ తరువాత ప్రియుడి చేతిలో హతమయ్యింది. 

woman assassinated by lover and his father over money dispute, extramarital affairs in tamilnadu
Author
First Published Oct 16, 2022, 10:02 AM IST

తమిళనాడు : వివాహేతర సంబంధంతో ప్రియుడు తన తండ్రితో కలిసి ప్రియురాలిని హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడితో పాటు అతని తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అరియలూరు జిల్లా తాపలూర్ కు చెందిన శక్తివేల్ కూలి పనిచేసి  జీవిస్తున్నాడు. ఇతనికి భార్య సత్య (30), ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, మేల్ కుడికాడు గ్రామానికి చెందిన అమృత రాజ్ (24)తో సత్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అతనితో కలిసి వెల్లకోయిల్ కు వెళ్ళింది. 

అయితే శక్తివేల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత పోలీసులు సత్యను గుర్తించి, ఆమెను మందలించి భర్తతో కలిసి జీవించమని పంపించారు. కానీ ఆ తర్వాత సత్యకు అమృతరాజ్ తమ్ముడు దేవాతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈసారి అతనితో కలిసి సత్య పారిపోయింది. దీంతో విసిగిపోయిన శక్తివేల్ తన ఇద్దరు పిల్లలను తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టి పని కోసం మలేషియా వెళ్లిపోయాడు.  

కనికరం లేకుండా దాడి చేస్తుంటే తిరగబడిన ఆవు.. మాములుగా కుమ్మలేదుగా.. వైరల్ అవుతున్న వీడియో..

ఈ క్రమంలో మామ ఇంట్లో ఉన్న సత్యకు అమృత రాజుకు మధ్య డబ్బుల వ్యవహారంలో గొడవ జరిగింది. దీంతో అమృత రాజ్,  అతని తండ్రి దేవేంద్రన్ కలిసి సత్యపై కత్తితో దాడి చేసి హతమార్చారు. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, అమృత రాజ్  అతని తండ్రి  దేవేంద్రన్ (57)ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. 

ఇదిలా ఉండగా, ప్రియుని కోసం భర్తను చంపేస్తున్న సంఘటనలు కర్ణాటకలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక టీవీ సీరియల్ ప్రేరణతో వివాహిత తన భర్తను చంపిన వైనం.. మండ్య జిల్లా మళవళ్లి తాలూకాలో జరిగింది. మళవల్లి ఎన్ఈఎస్  లేఅవుట్ లో నివాసముంటున్న శశి కుమార్ (30)ని భార్య నాగమణి(28),  ప్రియుడు హేమంత్ (25)లు కలిసి రాత్రి హత్య చేశారు. 

కనకపురలో గార్మెంట్స్ కు వెళుతున్న నాగమణికి హేమంత్ పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది.  ఇది తెలిసి భర్త ఆమెను పలుమార్లు మందలించాడు. మొబైల్ ఫోన్ లాక్కొని,, పనికి వెళ్ళవద్దని కట్టడి చేయడంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. భర్తను తప్పిస్తే తమకు ఏ అడ్డూ ఉండదని నాగమణి నిశ్చయించుకుంది. టీవీలో వచ్చే కన్నడ సీరియల్ శాంతం పాపం చూస్తూ అందులో మాదిరిగానే హత్యకు పథకం వేసింది.

ఆ రోజు రాత్రి ప్రియుడు హేమంత్ ను పిలిపించుకుంది. నిద్రపోతున్న పిల్లల చేతులు,కాళ్లు కట్టేసి నోట్లో బట్టలు కుక్కారు. తర్వాత మద్యం మత్తులో నిద్రిస్తున్న శశికుమార్ చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు. ఆ తరువాత ఎవరో దుండగులు ఇంట్లోకి చొరబడి చంపేశారని నాగమణి ఏడుపు అందుకుంది. కొడుకు మృతిపై అనుమానంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా సోమవారం నాడు..  కోడలిని అరెస్టు చేసి విచారించగా నేరం ఒప్పుకుంది. దీంతో నాగమణిని, ప్రియుడు హేమంత్ ను రిమాండ్ కు తరలించారు. ఆమె ఇద్దరు పిల్లలు అనాధలుగా మారిపోయారు

Follow Us:
Download App:
  • android
  • ios