కనికరం లేకుండా దాడి చేస్తుంటే తిరగబడిన ఆవు.. మాములుగా కుమ్మలేదుగా.. వైరల్ అవుతున్న వీడియో..
సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు పోస్టు చేయబడుతుంటాయి. అయితే అందులో కొన్ని మాత్రమే నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. తాజాగా ఓ వ్యక్తిపై ఆవు దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు పోస్టు చేయబడుతుంటాయి. అయితే అందులో కొన్ని మాత్రమే నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. తాజాగా ఓ వ్యక్తిపై ఆవు దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ముందుగా ఆ వ్యక్తి ఆవును హింసించడంతో.. తిరగబడిన ఆవు అతడిని కుమ్మేసింది. @gharkekalesh అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 75,000 కంటే ఎక్కువ వ్యూస్, 3,400 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.
అసలు వీడియోలో ఏముందంటే.. పగ్గంతో కట్టి ఉన్న ఆవును కొందరు వ్యక్తులు ముందుకు లాగుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఆవు వెనకాల ఉన్న ఓ వ్యక్తి.. ఆవును కనికరం లేకుండా తన్నడం, ఆవు తోకను లాగడం, పదేపదే హింసించే విధంగా ప్రవర్తించడం కనిపించింది. అయితే తొలుత ఆవు చాలా ఓర్పుగా ఉండిపోయింది. అయితే కొద్దిసేపటికి ఆ వ్యక్తి నుంచి హింస ఎక్కువ కావడంతో.. ఆవు తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే రెచ్చిపోయిన ఆవు.. అతడిపై దాడి చేసింది. ముందున్నవారి నుంచి బలంగా పగ్గాన్ని విడిపిచుకుని.. అతడిని కుమ్మేసింది. అతడిని నేలపై పడవేసి తన కొమ్ముతో దాడి చేసింది. కిందపడేసి తొక్కేసింది. దీంతో అక్కడున్నవారంతా భయంతో అరవడం కనిపించింది.
అయితే ఈ వీడియోను వీక్షిస్తున్న నెటిజన్లు కూడా.. ఆ వ్యక్తిదే తప్పని కామెంట్స్ చేస్తున్నారు. జంతువు పట్ల కనికరం లేకుండా వ్యవహరించడం మనిషి తప్పు అని పేర్కొంటున్నారు. ‘‘బాగా జరిగింది.. ఈ దాడికి అతడు అర్హుడు.. మీరు భగవంతుని అటువంటి అందమైన జీవులను గౌరవించలేకపోతే.. జీవులు కూడా మిమ్మల్ని గౌరవించవు’’ అని ఓ నెటిజన్ పేర్కొన్నారు.
అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయాన్ని మాత్రం.. పోస్టు చేసిన యూజర్ వెల్లడించలేదు. అలాగే ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి పరిస్థితి ఏమిటనేది కూడా తెలియాల్సి ఉంది.