Asianet News TeluguAsianet News Telugu

సినిమాను మించిన ట్విస్టులు.. భర్తను చంపాలనుకుని భార్య జైలుపాలు.. హంతకులతో భర్త ఫ్రెండ్షిప్.. ప్రియుడి ఆత్మహత్య

బెంగళూరుకు చెందిన ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుని తన భర్తనే చంపేయాలని అనుకుంది. ప్రియుడితో కలిసి మనుషులను మాట్లాడి సుపారీ ఇచ్చింది. అనంతరం వారు ఆమె భర్తను కిడ్నాప్ చేసి తమిళనాడు తీసుకెళ్లారు. కానీ, ఆయనను హత్య చేయకుండా ఫ్రెండ్షిప్ చేసి కెచప్ మీద పోసి చంపేసినట్టుగా ఫొటోలు తీసి ఆమెకు పంపారు. ఆ ఫొటోలు చూసి భయంతో ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

woman and lover plotted to kill husband but she jailed lover suicided know this twisted crime incident
Author
First Published Aug 22, 2022, 6:47 PM IST

బెంగళూరు: వివాహేతర సంబంధాలు అనేక నేరాలకు కారణాలుగా మారుతున్నాయి. ఈ సంబంధాలు కుటుంబాలను కూల్చడమే కాదు.. ప్రాణాలనే హరిస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుని కట్టుకున్న భర్తను కడతేర్చాలని పన్నాగం పన్నింది. ఇందుకోసం మనుషులను కూడా మాట్లాడింది. భార్య, ఆమె ప్రియుడు కలిసి ఈ కుట్రకు తెరలేపారు. హతమార్చాలని డీల్ కుదుర్చుకున్న మనుషులకు సుపారీ కూడా ఇచ్చారు. కానీ, ఈ ప్లాన్ తిరగబెట్టింది. చివరకు ఆ భార్యనే జైలుపాలు కావాల్సి వచ్చింది. ప్రియుడు ఆత్మహత్యే చేసుకున్నాడు. ఆ భర్త మాత్రం సేఫ్‌గా ఉన్నాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

పోలీసులు, మీడియా కథనాల ప్రకారం.. 26 ఏళ్ల అనుపల్లవి నవీన్ కుమార్‌ను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులు పీన్య సమీపంలోని దొడ్డబిదరకల్లులో నివాసం కాపురం పెట్టారు. అనుపల్లవి హిమావంత్ కుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అనంతరం, అనుపల్లవి తన భర్త నవీన్ కుమార్‌ను తమకు అడ్డు తొలగించుకోవాలని ఈ లోకం నుంచే శాశ్వతంగా పంపించేయాలని ప్లాన్ వేసింది. హిమావంత్, అనుపల్లవి ఇద్దరు కలిసి ఓ ప్లాన్ చేశారు. కిరాయి మనుషులతో నవీన్ కుమార్‌ను హత్య చేయాలని పథకం వేశారు. ఇందుకోసం వారు హరీష్, నాగరాజు, ముగిలాన్‌లను మాట్లాడారు. నవీన్ కుమార్, ఆయన క్యాబ్ డ్రైవర్‌ ఇద్దరినీ చంపేయాలని, అందుకు రూ. 2 లక్షలు ఇస్తామని ఈ ముగ్గురితో డీల్ కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా 90 వేలు ఇచ్చారు కూడా. మిగతావి నవీన్ కుమార్‌ను చంపేశాక ముట్టజెప్పుతామని ఒప్పందం చేసుకున్నారు.

జులై 23వ తేదీన హరీష్, ఆయన ఇద్దరు సహచరులు అనుపల్లవి భర్త నవీన్ కుమార్‌ను కిడ్నాప్ చేసి తమిళనాడుకు తీసుకెళ్లారు. కానీ, నవీన్ కుమార్‌ను చంపేసే ధైర్యాన్ని వార కూడగట్టుకోలేదు. ఆ దుస్సాహసానికి పూనుకోలేదు. అందుకే వారు నవీన్ కుమార్‌తో ఫ్రెండ్షిప్ చేశారు. చివరకు వారి ఫ్రెండ్షిప్ పార్టీ చేసుకునేదాకా వెళ్లింది.

ఈ తంతగమంతా ఒక వైపు జరుగుతుండగా నవీన్ కుమార్ హత్య పూర్తి అయిందా లేదా? అని తెలుసుకోవాలని అనుపల్లవి, హిమావంత్ కుమార్ ఆత్రుతంగా ఉన్నారు. హత్య కోసం మాట్లాడుకున్న మనుషులకు వారు కాల్ చేశారు. హత్య చేశారా? లేదా? అని అడిగారు. దీనికి సమాధానంగా తాము నవీన్ కుమార్‌ను హతమార్చామని వారు సమాధానం చెప్పారు. అంతేనా.. అందుకోసం ఒక ప్లాన్ కూడా ఆ మనుషులు రెడీ చేసి పెట్టుకున్నారు. నవీన్ కుమార్‌ను నిజంగానే చంపేసినట్టు అనుపల్లవి, హిమావంత్ కుమార్‌కు చూపెట్టాలని అనుకున్నారు.  కాబట్టి, నవీన్ కుమార్‌ను దారుణంగా చంపేసినట్టుగా కనిపించాలని, టమాటో కెచప్‌ను రక్తపు మరకలుగా సెటప్ చేశారు. నవీన్ కుమార్‌పై టమాటో కెచప్ పోసి అతడిని దారుణంగా హతమార్చినట్టు ఫొటోలు తీసి వారికి పంపించారు.

ఆ ఫొటోలు చూసి హిమావంత్ కుమార్ నిజంగానే బెంబేలెత్తిపోయాడు. భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇక కొన్ని రోజుల నుంచి తన సోదరుడు నవీన్ కుమార్ కనిపించకుండా పోయాడని సోదరి పోలీసులకు ఆగస్టు 2న ఫిర్యాదు చేసింది. కాగా, నవీన్ కుమార్ ఆగస్టు 6న తిరిగి వచ్చేశాడు. పోలీసుల ముందు కూర్చుని జరిగిన విషయాలన్నింటినీ ఒక దాని వెంట ఒకటి వరుసగా చెప్పేశాడు. అనంతరం, ఆయన భార్య అనుపల్లవి, హత్య కోసం ఆమె మాట్లాడిన ఆ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు అనుపల్లవి, హిమావంత్ ఫోన్‌లు చెక్ చేయగా.. అనుపల్లవి తల్లి అమ్మోజమ్మ కూడా ప్రమేయం కూడా ఈ కుట్రలో ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆమెను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios