వలసవాద మనస్తత్వం నుండి విముక్తి పొందాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

కాలానికి తగ్గట్టుగా  దేశ ఉత్పత్తులను రూపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్  సూచించారు. నాగ్ పూర్ లో దసరా పర్వదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భగవత్ పాల్గొన్నారు.

 Woke Claim To Work For Lofty Goals, But Real Aim Is...": Mohan Bhagwat lns


నాగ్‌పూర్: వలసవాద మనస్తత్వం నుండి విముక్తి పొందాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్  మోహన్ భగవత్  అభిప్రాయపడ్డారు.దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని  మంగళవారంనాడు నాగ్‌పూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో  మోహన్ భగవత్  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ప్రపంచం నుండి మన దేశానికి సరిపోయేవే తీసుకోవాలని ఆయన సూచించారు. కాలానికి తగినట్టుగా దేశ ఉత్పత్తులు రూపొందించుకోవాలన్నారు. స్వదేశీ అభివృద్ది మార్గాన్ని అవలంభించాల్సి ఉందని  భగవత్ చెప్పారు.  విధ్వంసక శక్తులు తమను తాము మేల్కొన్నాయని చెప్పుకుంటున్నాయన్నారు. 

భారత్ ఎదుగుదల యొక్క ఉద్దేశ్యం ఎప్పడూ ప్రపంచ సంక్షేమమేనని ఆయన అభిప్రాయపడ్డారు.  స్వార్థపూరిత, మోసపూరిత శక్తులు తమ మతపరమైన ప్రయోజనాలను కోరుకొనే శక్తులు సామాజిక ఐక్యతకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని మోహన్ భగవత్ చెప్పారు. సాంస్కృతిక మార్క్సిస్టులు అరాచకాలను ప్రోత్సహిస్తారని  మోహన్ భగవత్  విమర్శించారు.

కొన్ని ఉన్నతమైన లక్ష్యాల కోసం పనిచేస్తున్నారని  చెప్పుకుంటారని సాంస్కృతిక మార్కిస్టులపై ఆయన విమర్శలు గుప్పించారు.  మీడియా, విద్యా సంస్థలను నియంత్రించడం, విద్య, సంస్కృతి, రాజకీయాలు, సామాజిక వాతావరణాన్ని గందరగోళపర్చడమే వారి ఉద్దేశ్యమని ఆయన అన్నారు.

తన ప్రసంగంలో  మణిపూర్ హింస గురించి కూడ మోహన్ భగవత్ ప్రస్తావించారు. దశాబ్దకాలంగా  శాంతియుతంగా ఉన్న మణిపూర్ లో ఆకస్మాత్తుగా  విబేధాలు , వివాదాలు చోటు చేసుకున్నాయని ఆయన ప్రశ్నించారు.ఎవరికి స్వార్థం ఉంది, ఘటన జరిగిన వెంటనే  విద్వేషం, హింసను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న శక్తులు ఎవరని ఆయన  ప్రశ్నించారు.  మణిపూర్ లో శాంతి కోసం చర్యలు తీసుకొంటున్నట్టుగా  భగవత్ చెప్పారు. జాతీయ సమైక్యతకు అవసరమైన మూడు అంశాలను గురించి  మోహన్ భగవత్  ప్రస్తావించారు.

అయోధ్యలో రామమందిరానికి వచ్చే ఏడాది జనవరి  22న ప్రారంభోత్సవం చేయనున్నట్టుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు.ఈ సంఘటనను గుర్తు చేసుకోవడానికి దేశ వ్యాప్తంగా దేవాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన  ప్రజలను కోరారు.

ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో  ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరికి  తన శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా  శంకర్ మహదేవన్ చెప్పారు. ఈ కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios