Asianet News TeluguAsianet News Telugu

భారత్ తో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 30వేల కేసులు

ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 582 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 9,36,181కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 24,309కి పెరిగింది. 

With highest single-day spike of 29,429 coronavirus COVID-19 cases, India's tally at 9.36 lakh
Author
Hyderabad, First Published Jul 15, 2020, 12:55 PM IST

భారత్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. భారత్ లో కరోనా కేసులు దాదాపు 10 లక్షలకు చేరువయ్యాయి. కేవలం నిన్న ఒక్కరోజే దాదాపు 30వేల కేసులు నమోదవ్వడం గమనార్హం.

గత 24 గంటల్లో భారత్‌లో 29,429 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 582 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 9,36,181కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 24,309కి పెరిగింది. 

ప్రస్తుతం 3,19,840 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,92,032 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,20,92,503 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,86,247 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. కాగా ఈమేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వివరాలు తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ విజృంభణ భారీగానే ఉంది.  రా7,6ష్ట్రాల వారీగా.. కరోనా కేసులను ఒకసారి పరిశీలిస్తే...మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,67,665 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 10,695మంది  ప్రాణాలు కోల్పోయారు. తర్వాతి స్థానంలో తమిళనాడు ఉంది. ఈ రాష్ట్రంలో 1,47,324మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. కాగా ఇప్పటి వరకు 2,099మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాతి స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ ఉంది. ఇప్పటి వరకు ఢిల్లీలో 1,15,346మందికి కరోనా సోకగా... 3,446మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు.

గుజరాత్ లో 43,637. ఉత్తరప్రదేశ్ 39,724 రాజస్థాన్ 25,571, మధ్యప్రదేశ్ 19,005 పశ్చిమ బెంగాల్ 32,838 హర్యానా 22,628 కర్ణాటక 44,077 ఆంధ్రప్రదేశ్ 33,019 తెలంగాణన 37,745 అస్సాం 17,807 బిహార్ 19,824 మంది కరోనా బారిన పడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios