భోపాల్ లో హేయమైన ఘటన వెలుగు చూసింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఓ ఇద్దరు యువకులను దారుణంగా హింసించి..వారితో మలం తినిపించారు. 

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని శివపురిలో లైంగిక వేధింపుల ఆరోపణలపై నిమ్నకులస్తులైన ఇద్దరు యువకులు క్రూరమైన హింసకు గురయ్యారు. ఒకరు జాతవ్ కమ్యూనిటీకి చెందిన దళితుడు. కాగా, మరొకరు ఇతర వెనుకబడిన తరగతి కేవత్ కమ్యూనిటీకి చెందినవాడు.

శివపురిలోని నార్వార్ ప్రాంతంలోని వార్ఖాడిలో జూన్ 30న ఈ ఘటన జరిగింది. ఇద్దరు యువకులను దారుణంగా కొట్టారు. దీంతో దెబ్బలకు వారి ముఖాలు నల్లబడ్డాయి. వారితో బలవంతంగా మలం తాగించారు. ఆ తరువాత అవమానకరంగా పట్టణంలో ఊరేగించారు.

దీనిమీద బాధితుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివపురి జిల్లా పోలీసులు స్థానిక మైనారిటీ కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులపై దాడికి పాల్పడ్డారని కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు నిందితులను ఇప్పటికే పట్టుకున్నారు.

ఓ సారి క్రిమినల్ ను కాపాడిన డాక్టర్.. గుర్తుంచుకొని మరీ హత్య కుట్రపై అలెర్ట్ చేసిన కాంట్రాక్ట్ కిల్లర్..

విచారణలో, లైంగిక వేధింపుల ఆరోపణలు నిరాధారమైనవని స్థానిక పోలీసు వర్గాలు ధృవీకరించాయి. ఆస్తికి సంబంధించిన వివాదంతో ఈ సంఘటన ముడిపడి ఉందని, దాడి చేసినవారు తప్పుగా దీన్ని ప్రొజెక్ట్ చేశారని పేర్కొన్నారు.

దీనిమీద హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. ఇద్దరు వ్యక్తులపై జరిపిన ఈ దారుణమైన హింస... "మానవత్వాన్ని సిగ్గుపడే తాలిబానీ చర్య" అని తీవ్రంగా ఖండించారు.

"ఇటువంటి చర్యలను సహించేది లేదు. చాలా మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) ప్రయోగించాలని, వారి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని శివపురిలోని స్థానిక పరిపాలనాధికారులకు సూచించాం" అని మిశ్రా చెప్పారు.

ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని హోంమంత్రి ఆరోపిస్తూ, "స్థానిక కాంగ్రెస్ నాయకులు అధికారులకు ఫోన్‌లు చేసి విషయాన్ని వెలుగులోకి రాకుండా చూడాలని అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించడం మరింత సిగ్గుచేటు" అని పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌లో ఒక గిరిజన సంఘం సభ్యుడిపై మూత్ర విసర్జన చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనను వీడియో తీయడంతో తీవ్రస్థాయిలో నిరసనకు తెరలేపింది. 

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం గిరిజనుడి పాదాలను కడిగి, ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, అతనికి క్షమాపణలు చెప్పారు.పేదలకు వ్యతిరేకంగా ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.