Asianet News TeluguAsianet News Telugu

మై లార్డ్ అనడం ఆపవా.. నా సగం జీతం ఇస్తా: న్యాయవాదితో సుప్రీంకోర్టు జడ్జీ

మై లార్డ్ అని అనడం ఆపు.. నా సగం జీతం ఇస్తా అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి బుధవారం ఓ సీనియర్ అడ్వకేట్‌తో అన్నారు. మై లార్డ్ అని పిలవడానికి బదులు సార్ అని పిలవొచ్చు కదా అని సూచించారు.
 

will you stop saying my lord, will give you my half salary supreme court judge comment kms
Author
First Published Nov 3, 2023, 3:10 PM IST

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా విచారణ సమయంలో న్యాయవాదులు న్యాయమూర్తులను మై లార్డ్ అని లేదా యువర్ లార్డ్‌ అని సంబోధిస్తారు. 2006లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇలా పిలవొద్దని ఓ తీర్మానం చేసినా.. న్యాయవాదులు మాత్రం అదే పాత ధోరణిని అనుసరిస్తున్నారు. తాజాగా, ఈ పిలుపుపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘ఎన్ని సార్లు మై లార్డ్స్ అని పిలుస్తావు? ఇలా పిలవడం ఆపేస్తే నా సగం జీతం ఇస్తానయ్యా..’ అని జస్టిస్ పీఎస్ నరసింహా అన్నారు. సీనియర్ జస్టిస్ ఏఎస్ బోపన్నతోపాటు ధర్మాసనంలో ఉన్న పీఎస్ నరసింహా బుధవారం విచారణలో ఈ వ్యాఖ్యలు చేశారు.

మై లార్డ్ అని పిలవడానికి బదులు సార్ అని పిలవొచ్చు కదా అని జస్టిస్ నరసింహా సూచించారు. లేదంటే నీ వాదనల్లో ఎన్నిసార్లు మై లార్డ్ అని పిలుస్తావో లెక్కపెడుతా అని పేర్కొన్నారు. 

Also Read: మరోసారి అమిత్ షా-ఎన్టీఆర్ భేటీ!? కారణం ఏంటో

వాదనలు వినిపించేటప్పుడు న్యాయవాదులు మై లార్డ్ అని వినియోగించడం సర్వసాధారణం. కొందరు ఇలా పిలవడాన్ని వ్యతిరేకిస్తుంటారు. ఇలా పిలవడాన్ని వలసవాద కాలం నాటి సంప్రదాయం అని, బానిసత్వ చిహ్నం అని వాదిస్తుంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios