Asianet News TeluguAsianet News Telugu

మరోసారి అమిత్ షా-ఎన్టీఆర్ భేటీ!? కారణం ఏంటో


కారణమేదైనా.. ఎన్టీఆర్‌, అమిత్‌షా భేటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భాజపా అగ్ర నాయకత్వం ఫోకస్‌ పెట్టిన నేపథ్యంలో ..

Union Home Minister #AmitShah to Meet #NTR Again? JSP
Author
First Published Nov 3, 2023, 2:22 PM IST

కొన్ని మీటింగ్ లు, కలయికలు ఎప్పుడూ ఆసక్తి కలిగించేవే. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్‌ లాస్ట్ ఇయిర్  ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మునుగోడు పర్యటనలో భాగంగా అమిత్‌ షా అప్పుడు హైదరాబాద్‌ వచ్చారు. మునుగోడులో భాజపా సమరభేరి సభ ముగిసిన తర్వాత అమిత్‌ షా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న నోవాటెల్‌ హోటల్‌కు చేరుకున్నారు. నోవాటెల్‌లో అమిత్ షా, ఎన్టీఆర్‌ ఇరువురు సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు వీరి సమావేశం సాగింది. అలాగే ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ ని, అమిత్ షా కలవబోతున్నారని మీడియాలో ప్రచారం జరుగుతోంది.

త్వరలో తెలంగాణలో త్వరలో శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఈ వార్త ప్రధాన్యత సంతరించుకుంది. అధికార బీఆరెస్స్, కాంగ్రెస్ లు ప్రచారాలతో హోరెత్తించేస్తూ..దూకుడు మీదున్నాయి. ఈ సమయంలో బీజేపీ పొత్తులకు తెరతీసింది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తెలంగాణలో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది.  అయితే తెలుగుదేశంతో పవన్ ముందుకు వెళ్తున్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్ తో భేటీ నిజమే అయితే ఇది ఖచ్చితంగా ప్రాధాన్యమైన విషయమే. అలాగే  స్కిల్ డేవలప్ మెంట్ స్కాం కేసులో బాబు అరెస్ట్ ను జూనియర్ ఖండించలేదని టీడీపీ నేతలు ఓ పులుపెక్కిపోయారనే కామెంట్లూ వినిపించాయి. దీనిపై "డోంట్ కేర్" అని రియాక్షన్లూ వచ్చాయి. ఈ నేపథ్యంలో... జూనియర్ – అమిత్ షా భేటీ అనే అంశం తెరపైకి రావటమూ ఆసక్తికరంగా మారింది. 

కారణమేదైనా.. ఎన్టీఆర్‌, అమిత్‌షా భేటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భాజపా అగ్ర నాయకత్వం ఫోకస్‌ పెట్టిన నేపథ్యంలో రాజకీయంగానూ ఈ భేటీకి ప్రాధాన్యమేర్పడింది. భేటీ అనేది జరిగితే ఏయే అంశాలపై వీరిద్దరూ మాట్లాడుకోబోతున్నారు? రాజకీయ పరమైన కారణాలా? ఇతర అంశాలా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.  ఏదేమైనా ఈ భేటీ జరిగితే అది రెగ్యులర్ మీటింగ్ అయితే కాదు.  

Follow Us:
Download App:
  • android
  • ios