మేం అధికారంలోకి వస్తే అయోధ్య రాముడి దర్శనం చేయిస్తాం: మధ్యప్రదేశ్‌లో అమిత్ షా హామీ

మధ్యప్రదేశ్‌లో కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా సంచలన హామీ ప్రకటించారు. బీజేపీకి అధికారాన్ని కట్టబెడితే రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామ మందిర దర్శనం చేయిస్తామని హామీ ఇచ్చారు.
 

will take madhya pradesh peoples to ayodhya ram temple if bjp form government says amit shah kms

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 17వ తేదీన జరుగుతున్నాయి. మరో రెండు రోజులైతే క్యాంపెయిన్ ముగిసిపోనుంది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు హామీలు కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్‌లో ఓ ప్రజాకర్షక హామీని ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్ వాసులను అయోధ్యలోని రామ మందిరానికి తీసుకెళ్లుతామని హామీ ఇచ్చారు. దఫాలుగా ఇక్కడి నుంచి ప్రజలు తీసుకెళ్లి రామ మందిరం దర్శనం చేయిస్తామని చెప్పారు.

సోమవారం విదిశలో నిర్వహించిన ఓ ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు. తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ తరుచూ ఉత్తరప్రదేశ్‌లో అయోధ్య రామ మందిరం నిర్మాణ తేదీ ఎప్పుడు అని అడిగేవారని అన్నారు. ఆ రాహుల్ గాంధీకి తాను ఇప్పుడు సమాధానం చెబుతున్నానని వివరించారు. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని తెలిపారు.

Also Read: కాంగ్రెస్ యాడ్స్‌పై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు.. మరో యాడ్‌తో కాంగ్రెస్ కౌంటర్ (Video)

ఈ సందర్భంలో ఓ బీజేపీ నేత తాము అయోధ్య మందిర దర్శనం కోసం డబ్బులు ఖర్చు చేసుకోవాల్సి ఉంటుందా? అని ప్రశ్నించగా.. దీనికి అమిత్ షా సమాధానం ఇస్తూ ఈ హామీ ఇచ్చారు. అయోధ్య రామ మందిర దర్శనం కోసం ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదని వివరించారు. మధ్యప్రదేశ్‌లో మరోసారి బీజేపీకి అధికారం కట్టబెడితే తామే రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామ మందిర దర్శనం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని తాము తమ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ప్రకటించామని తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios