నన్నే ప్రశ్నిస్తావా? చంద్రయాన్ 4తో నిన్ను చంద్రుడి మీదికి పంపేస్తా: పేద మహిళపై హర్యానా సీఎం

హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ ఓ పేద మహిళపై నోరుపారేసుకున్నారు. తమ ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీ కట్టాలని అడిగిన ఓ మహిళపై వెటకారంగా కామెంట్ చేశారు. నిన్ను చంద్రయాన్ 4తో చంద్రుడి మీదికి పంపిస్తా.. కూర్చో అని అన్నారు.
 

will send you to the moon with chandrayaan 4, haryana cm manohar lal khattar comments on poor lady kms

న్యూఢిల్లీ: హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టారు పేద మహిళపై నోరు పారేసుకున్నారు. తమ ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీ కట్టాలని, తద్వార తమకు ఉపాధి కల్పించాలని ఆ మహిళ సీఎం కట్టార్‌ను కోరింది. దీంతో ఆమెను సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ పరిహసించారు. ముందు నువ్వు కూర్చో.. చంద్రయాన్ 4తో నిన్ను కూడా చంద్రుడి మీదికి పంపేస్తా అంటూ వెటకారంగా వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సీఎం మనోహర్ లాల్ ఖట్టార్  తీరుపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. హర్యానా పై ఫోకస్ పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శిస్తూ ఎక్స్‌లో  పోస్టు చేసింది. ఉపాధి చూపాలని ఓ మహిళ సీఎంను కోరడం తప్పా? ఆమె ఏం నేరం చేసిందని సీఎం ఇలా మాట్లాడతారు? ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటు. ప్రజా సేవ చేయడానికి అధికారంలోకి వచ్చిన నేతలు ప్రజలనే పరిహసిస్తున్నారు.. అంటూ ఆప్ పోస్టు చేసింది.

Also Read: 2024: సౌత్ ఇండియా పై బీజేపీ ఫోకస్.. జేడీఎస్‌తో పొత్తు, నాలుగు సీట్ల పై డీల్: బీఎస్ యెడియూరప్ప

ఇదే విధమైన డిమాండ్ ప్రధాని మోడీకి ఆయన మిత్రులైన కార్పొరేట్ల నుంచి వస్తే అప్పుడు మాత్రం హర్యానా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వారి సేవలో తరించేది కాదా అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పించింది. పేద మహిళ కష్టం సీఎం ఖట్టార్‌కు నవ్వులా టగా ఉన్నదని ఆగ్రహించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios