2024: సౌత్ పై బీజేపీ ఫోకస్.. జేడీఎస్‌తో పొత్తు, నాలుగు సీట్లపై డీల్: బీఎస్ యెడియూరప్ప
బీజేపీ మళ్లీ సౌత్ పై ఫోకస్ పెంచుతున్నది. లోక్ సభ ఎన్నికల కోసం కర్ణాటకలో జేడీఎస్‌తో పొత్తు పెట్టుకుంటున్నది. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్ప ధ్రువీకరించారు. నాలుగు సీట్లపై ఇప్పటికే డీల్ కన్ఫామ్ అయిందని వివరించారు.
న్యూఢిల్లీ: 2024 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ దక్షిణాదిపై దృష్టి సారిస్తున్నది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీ తీవ్ర నిరాశలోకి వెళ్లింది. కానీ, కర్ణాటక నుంచే లోక్ సభ ఎన్నికల కోసం వ్యూహ రచన ప్రారంభించింది. కర్ణాటకలో జేడీఎస్‌తో బీజేపీ ఓ ఒప్పందానికి వచ్చింది. నాలుగు సీట్లుపై డీల్ కుదిరినట్టు కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ లీడర్ బీఎస్ యెడియూరప్ప వెల్లడించారు.
లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ, జేడీఎస్‌లు దగ్గరవుతున్నాయని బీఎస్ యెడియూరప్ప ధ్రువీకరించారు. కర్ణాటకలో ఈ రెండు పార్టీలో అవగాహనలో ఉంటాయని, అదే అవగాహనతో రెండు పార్టీలూ ఎన్నికలకు వెళ్లుతాయని వివరించారు.
జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ దేవేగౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కావడం సంతోషంగా ఉన్నదని బీఎస్ యెడియూరప్ప అన్నారు. వారు ఇప్పటికే నాలుగు సీట్లపై తుది నిర్ణయానికి వచ్చారని వివరించారు. వారి నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్టు కామెంట్ చేశారు. అయితే.. ఇటీవలి కాలంలో హెచ్‌డీ దేవెగౌడ్, ఆయన కొడుకు కుమారస్వామి కూడా కేంద్రంలోని బీజేపీ పై తరుచూ విమర్శలు సంధించారు. జేడీఎస్‌కు నాలుగు ఎంపీ సీట్లను బీజేపీ ఇవ్వడానికి రెడీ ఉందని తెలుస్తున్నది.
Also Read: రావణుడి వల్లే కాలేదు.. వీళ్లెంతా?: సనాతన ధర్మంపై యోగి ఆదిత్యానాథ్
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వడంపై జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నది. ఇందులో చాలా వరకు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సానుకూల అభిప్రాయాలే వచచాయి.