కేంద్ర ప్రభుత్వం మరోసారి వాహనదారులకు షాకిచ్చే  అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికి దేశంలో ఇంధన ధరలను చమురు కంపెనీలు దాదాపు రెండు నెలలుగా పెంచలేదు.

ఇందుకు ప్రధాన కారణం ఐదు రాష్ట్రాల ఎన్నికలేనన్నది బహిరంగ రహస్యం. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఇంధన ధరలు పెరిగే అవకాశం వుందని నిపుణులు అంటున్నారు. 

Also Read:వాహనదారులకు బిగ్ రిలీఫ్.. 15 రోజుల తరువాత మళ్ళీ తగ్గిన ఇంధన ధరలు.. నేడు ఎంతంటే ?

ప్రస్తుతం ఎన్నికల వల్ల ఏర్పడిన నష్టాలను తిరిగి పూడ్చుకోవడానికి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉంది. అలాగే డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం వల్ల నష్టాలను పూడ్చుకోవడానికి డీజిల్, పెట్రోల్ ధరలను దశల వారీగా కనీసం రూ 2-3 పెంచాలని ఆయా కంపెనీలు ఆలోచిస్తున్నాయి.

ధరల పెంపు అనేది మే మొదటి వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  2021లో ఫిబ్రవరి 27 నాటికి పెట్రోల్, డీజిల్ ధరలను 26 రెట్లు పెంచారు. పెట్రోల్ ధర లీటరుకు 7.46 రూపాయలు, డీజిల్ ధర లీటరుకు 7.60 రూపాయలు పెరిగింది.