కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాలను మళ్లీ తీసుకొస్తామంటూ వ్యాఖ్యానించారు. స్వల్ప మార్పులతో వ్యవసాయ చట్టాలు తీసుకొస్తామని తోమర్ స్పష్టం చేశారు. రైతుల కోసం ప్రధాని మోడీ ఎంతో చేశారని ఆయన ప్రశంసించారు

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాలను మళ్లీ తీసుకొస్తామంటూ వ్యాఖ్యానించారు. స్వల్ప మార్పులతో వ్యవసాయ చట్టాలు తీసుకొస్తామని తోమర్ స్పష్టం చేశారు. రైతుల కోసం ప్రధాని మోడీ ఎంతో చేశారని ఆయన ప్రశంసించారు. 70 ఏళ్లలో ఎవరూ చేయని పనిని మోడీ చేశారని తోమర్ గుర్తుచేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కాగా.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగుచట్టాలకు (farm laws) వ్యతిరేకంగా రైతులు దాదాపు ఏడాది పాటు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే . ఎట్టకేలకు దిగివచ్చిన కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఉపసంహరణ బిల్లులకు కూడా నవంబర్‌ 29న పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయినప్పటికీ రైతులు ఢిల్లీలోనే తిష్ట వేశారు. ఆందోళన సమయంలో తమపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు. అయితే కేంద్రం హామీపై నిరసనకు స్వస్తి చెప్పి స్వస్థలాలకు బయల్దేరారు. 

Also Read:సాగు చట్టాలు.. రైతులపై కేసులు, రాష్ట్రాలదే తుది నిర్ణయం: కేంద్రమంత్రి తోమర్

ఈ నేపథ్యంలో రైతులపై నమోదైన కేసులకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి (union agriculture minister) నరేంద్ర సింగ్ తోమర్ (narendra singh tomar) కీలక ప్రకటన చేశారు. కేసులు ఉపసంహరణపై ఆయా రాష్ట్రాలదే నిర్ణయమని తోమర్‌ పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయం రాష్ట్రాలదే అయినందున వాటిపై తుది నిర్ణయం కూడా వారిదేనని ఆయన స్పష్టంచేశారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆందోళనలను విరమించుకోవడంపై కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం విడుదల చేసే నగదు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారులకే చేరుతోందని ఆయన ఉద్ఘాటించారు.