Asianet News TeluguAsianet News Telugu

పాక్ విజయాన్ని వేడుక చేసుకున్నవారిపై ‘దేశద్రోహం’ కేసు.. సీఎం వార్నింగ్

ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ముగిసి నాలుగు రోజులు గడుస్తున్నా దాని ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్తాన్ గెలిచింది. పాక్ గెలుపును వేడుకలు చేసుకున్న కొందరిపై తీవ్ర వ్యతిరేకత వెలువడుతున్నది. పలురాష్ట్రాలు కేసులు నమోదయ్యాయి. అరెస్టులూ జరిగాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ అలాంటి వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాక్ విజయాన్ని వేడుక చేసుకున్నవారిపై దేశద్రోహం అభియోగాలు మోపుతామని స్పష్టం చేశారు.
 

will impose sedition against those celebrating pakistan win warns UP CM yogi adityanath
Author
Lucknow, First Published Oct 28, 2021, 12:40 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

లక్నో: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో Indiaపై Pakistan విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్ ఓటమిపై కొందరు కలత చెందగా ఇంకొందరు స్పోర్టివ్‌గా తీసుకుని మూవ్ అయ్యారు. మరికొందరు ఏకంగా పాకిస్తాన్ విజయాన్ని Celebrate చేసుకున్నారు. ఇప్పుడు ఆ వేడుక చేసుకున్నవారే దేశమంతటా చర్చనీయాంశమవుతున్నారు. తాజాగా Uttar Pradesh ముఖ్యమంత్రి Yogi Adityanath అలాంటి వారికి స్ట్రాంగ్ Warning ఇచ్చారు. T20 World Cup మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయాన్ని వేడుక చేసుకున్నవారిపై దేశద్రోహం (Sedition)అభియోగాలు మోపుతామని స్పష్టం చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదిత్యానాథ్ కార్యాలయం ట్విట్టర్‌లో ఈ విషయాన్ని పోస్టు చేసింది.

పాకిస్తాన్ విజయం తర్వాత భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలిచ్చిన ముగ్గురు కశ్మీరీ ఇంజినీరింగ్ స్టూడెంట్లను ఆగ్రాలో అరెస్టు చేశారు. ఈ అరెస్టుల తర్వాతి రోజే యోగి ఆదిత్యానాథ్ ఈ హెచ్చరికలు చేశారు. దేశవ్యతిరేక నినాదాలివ్వడంపై స్థానిక బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. అనంతరం కాలేజీ యాజమాన్యం వారిని సస్పెండ్ చేసింది. పలు సెక్షన్‌ల కింద పోలీసులు వారిని అరెస్టు చేశారు. కశ్మీరీ విద్యార్థులు దేశవ్యతిరేక నినాదాలివ్వగానే రైట్ వింగ్ సంఘాలు కాలేజీ లోపటికి వచ్చి ఆందోళనలు చేశాయని కాలేజీ స్టాఫ్ తెలిపింది. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇలాంటి ఉదంతాల్లో ఏడుగురిని ఐదు కేసుల్లో అరెస్టు చేసింది. ఆగ్రా, బరేలీ, బదౌన్, సీతాపూర్‌లలో ఈ కేసులు నమోదయ్యాయి.

Also Read: IND vs PAK: పాక్ విజ‌యంపై సంబురాలు.. యూపీలో ముగ్గురు కాశ్మీరీ విద్యార్థులు అరెస్ట్

రాజస్తాన్, జమ్ము కశ్మీర్‌లోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయి. రాజస్తాన్‌లో ఓ స్కూల్ టీచర్ పాకిస్తాన్ విజయాన్ని కొనియాడుతూ వాట్సాప్ స్టేటస్ పెట్టారు. ఆయనపైనా కేసు ఫైల్ అయింది. కాగా, జమ్ము కశ్మీర్‌లోనూ రెండు కేసులు నమోదయ్యాయి. హాస్టల్‌లలో ఉంటున్న కొందరు మెడికల్ స్టూడెంట్లపై ఉపా కింద కేసులు నమోదయ్యాయి.

పంజాబ్‌లోనూ ఈ ఛాయలు కనిపించాయి. మ్యాచ్ అయిపోయాక సంగ్రూర్ జిల్లాలో కశ్మీరీ విద్యార్థులు, యూపీ, బిహార్ నుంచి వచ్చిన విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగాయి.

ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ విజయంపై సంబురాలు చేసుకుంటే తప్పేంటని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ప్రశ్నించారు. మ్యాచ్ జరిగిన తర్వాతి రోజు ఆమె ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. పాకిస్తాన్ విజయంపై వేడుకలు చేసుకునే కశ్మీరీలపై ఎందుకు అంత ఆగ్రహం అని అడిగారు. కొందరు ఏకంగా దేశద్రోహులను తుపాకులతో కాల్చి చంపండనే నినాదాలిచ్చారని పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన తర్వాత కొందరైతే స్వీట్లు పంచుకుని వేడుకలు చేసుకున్నారు కదా..? అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో విరాట్ కోహ్లీని ప్రశంసించారు. సరే భిన్నాభిప్రాయాలున్నాయని ఏకాభిప్రాయానికి వద్దామని పేర్కొన్నారు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌ను అభినందించిన తొలి వ్యక్తి విరాట్ కోహ్లీలా దీన్ని సరైన దృక్పథంలో చూద్దామని వివరించారు.

Also Read: T20 Worldcup: ‘అతి తెలివిగా మాట్లాడకు.. షో నుంచి బయిటికి నడువు..’ టీవీషోలో అక్తర్ కు ఘోర అవమానం

ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. అందులో పది వికెట్లతో పాకిస్తాన్ టీమ్ గెలుపొందింది. మ్యాచ్ ముగిసి నాలుగు రోజులు గడుస్తున్నా దాని ప్రకంపనలు మాత్రం దేశంలో ఇంకా కొనసాగుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios