Asianet News TeluguAsianet News Telugu

రైతు కూలీలకు రూ. 10 వేల ఆర్థిక సాయం: రాహుల్ గాంధీ హామీ

ఛత్తీస్‌గడ్‌లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూమి లేని రైతులకు రూ. 10 వేల చొప్పున ప్రతి సంవత్సరం అందిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. పేద ప్రజలు ఆరోగ్య ప్రయోజనాలు కల్పించే స్కీమ్ విస్తృతిని పెంచుతామని చెప్పారు.
 

will give rs 10000 to landless farmers in chhattisgarh after retaining to power says rahul gandhi kms
Author
First Published Oct 29, 2023, 6:46 PM IST

రాయ్‌పూర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఛత్తీస్‌గడ్ ఎన్నికల ప్రచారంలో కీలక హామీ ప్రకటించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే భూమిలేని రైతు కూలీలకు యేటా రూ. 10 వేల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆరోగ్య సహాయక పథకాన్ని మరింత విస్తరిస్తామని చెప్పారు. పేదలకు ఆరోగ్య పథకం కింద కవర్‌ను రూ. 10 లక్షలకు పెంచుతామని తెలిపారు.

ఛత్తీస్‌గడ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా హెడ్‌క్వార్టర్స్ రాహుల్ గాంధీ ఈ రోజు మాట్లాడారు. ‘ రైతులు, కూలీలతో మేం మాట్లాడినప్పుడు వారు ఓ విషయాన్ని మా దృష్టికి తీసుకువచ్చారు. రాజీవ్ గాంధీ భూమిహీన్ కిసాన్ న్యాయ్ యోజనా కింద రూ. 7000 అందిస్తున్నారని చెప్పారు. అయితే, ఆ డబ్బులు తక్కువగా ఉన్నాయని వివరించారు. దీంతో కారులో ప్రయాణిస్తూ మేం చర్చించుకున్నాం. భూమి లేని రైతులకు రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని రాహుల్ గాంధీ తెలిపారు.

Also Read: పాలేరు నుండి బరిలోకి: నవంబర్ 4న వైఎస్ షర్మిల నామినేషన్

కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల జన గణన తొలి రోజు నుంచే చేపడతామని రాహుల్ గాంధీ అన్నారు. అదే విధంగా ఛత్తీస్‌గడ్‌లోనూ అధికారంలోకి వచ్చిన తొలి రోజునే కుల జనగణన చేపడుతామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులు, పేద ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని రాహుల్ గాంధీ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios